RCB vs KKR IPL 2024 : ప్రస్తుతం గౌతమ్ గంభీర్ కోల్ కతా టీమ్ లో మెంటార్ గా కొనసాగుతున్నాడు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం ఆర్సీబీ ప్లేయర్ గా రంగంలోకి దిగుతున్నాడు. వీరిద్దరూ తమతమ జట్లను గెలిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఇరు జట్ల మధ్య పరిస్థితులను గమనిస్తే ఇదొక క్రాకింగ్ గేమ్ అని చెప్పక తప్పదు.
RCB vs KKR IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో మరో బిగ్ ఫైట్ కు బెంగళూరు వేదిక కానుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో తలపడే జట్లు విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ, గౌతమ్ గంభీర్ టీమ్ కోల్ కతా నైట్ రైడర్స్. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తనదైన స్టైల్లో స్పందిస్తూ యుద్ధం ప్రకటించాడు. తాను ఎదైనా జట్టును ఓడించాలనే ఆలోచన ఉంటే మొదట అది ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ ఉంటుందనీ, ఈ టీమ్ ను తాను ప్రతిరోజూ ఓడించాలనుకుంటున్నానని గంభీర్ పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా ఇరు జట్లు ఈడెన్ గార్డెన్స్ తో పాటు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనూ అభిమానులకు విపరీతమైన వినోదాన్ని అందించాయి.
ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మాత్రమే కాదు, ఈ మ్యాచ్ కూడా ఎన్నో వేడి క్షణాలకు ఆతిథ్యమిచ్చింది. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీల మధ్య మాటల యుద్ధం జరగడం, అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య మ్యాచ్లన్నీ హోరాహోరీగా సాగాయి. ఇప్పుడు మరోసారి ఐపీఎల్ 2024లో ఇరు జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ కోల్ కతా టీమ్ లో మెంటార్ గా కొనసాగుతున్నాడు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం ఆర్సీబీ ప్లేయర్ గా రంగంలోకి దిగుతున్నాడు. వీరిద్దరూ తమతమ జట్లను గెలిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఇరు జట్ల మధ్య పరిస్థితులను గమనిస్తే ఇదొక క్రాకింగ్ గేమ్ అని చెప్పక తప్పదు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. ఆర్సీబీ ఏమీ గెలవలేదనీ, అయినా అన్నీ గెలిచామనే దృక్పథం ఉందని చెప్పాడు. ఇది గతంలో గంభీర్ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ.. ఇప్పుడు ఆ వీడియో దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఏమయ్యా ముంబై కెప్టెన్ ఇలా చేస్తున్నావేంది.. మరో వివాదంలో హార్దిక్ పాండ్యా ! వీడియోలు వైరల్ !
అందులో గంభీర్.. "నేను కలలో కూడా అందరినీ ఓడించాలనుకుంటున్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వారు రెండవ అత్యంత హై-ప్రొఫైల్ జట్టు, యజమానితో పాటు స్టార్లతో కూడిన జట్టు.. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్.. వారు ఏమీ గెలవలేదు, కానీ ఇప్పటికీ వారు అన్నీ గెలిచారని అనుకుంటారు.. అలాంటి వైఖరిని కలిగి ఉన్నారని" కామెంట్స్ చేశారు.
RCB vs KKR : బెంగళూరు vs కోల్‌కతా.. పరుగుల వరద పారడం ఖాయం.. వీరి ఆట చూడాల్సిందే.. !
