Asianet News TeluguAsianet News Telugu

IPL 2021: రోహిత్ శర్మ ఇచ్చిన గిఫ్ట్ చూసి, భయపడిన రితికా... క్యూట్ వీడియో పోస్టు చేసిన ‘హిట్ మ్యాన్’...

ఫ్రాంక్ స్టార్ రోహిత్ శర్మ‌, చేతిలో ఏం దాచాడోనని భయపడిన రితికా... క్యూట్ వీడియోను అభిమానులతో పంచుకున్న రోహిత్ శర్మ...

IPL 2021: Mumbai Indians Captain Rohit Sharma shares prank video with his wife Ritika
Author
India, First Published Oct 4, 2021, 6:05 PM IST

టీమిండియాలోకి క్రికెటర్లలో ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీ20ల్లో అత్యధిక సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీలు, వరల్డ్‌కప్‌ టోర్నీలో వరుస సెంచరీలు... ఇలా ఎన్నో అరుదైన రికార్డులు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు...

ఇదీ చదవండి: IPL2021: అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, రషీక్ సలాం... కశ్మీరీ కుర్రాళ్ల సక్సెస్ వెనక ఇర్ఫాన్ పఠాన్...

ముంబై ఇండియన్స్ జట్టుకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్‌గా ఉన్నాడు... రోహిత్ శర్మ తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలను కూడా అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా తన భార్య రితికాతో చేసిన ఓ ఫ్రాంక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు రోహిత్ శర్మ...

ఇదీ చదవండి: IPL 2021: అప్పుడే హార్ధిక్ పాండ్యాను తీసుకోవాలని సన్‌రైజర్స్‌కి సూచించిన ఇర్ఫాన్ పఠాన్... వీవీఎస్ ఏం చేశాడంటే

తన చేతిలో ఓ క్యాండీని దాచిన రోహిత్ శర్మ, భార్య దగ్గరికెళ్లి తీసుకొమ్మని కోరాడు. అయితే ఫ్రాంక్స్ చేసే రోహిత్ శర్మ, చేతిలో ఏదో పెట్టి, తనను ఫూల్ చేయబోతున్నాడని భావించిన రితికా శర్మ... ఆ గిఫ్ట్ తీసుకోవడానికి భయపడింది... ‘హిట్ మ్యాన్’ ఎంతగానో నచ్చజెప్పిన తర్వాత ఆ చేతిని ఓపెన్ చేసింది రితికా... 

ఈ సంఘటన మొత్తాన్ని మొబైల్‌లో షూట్ చేసిన రోహిత్ శర్మ, దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2015లో స్పోర్ట్స్ మేనేజర్ రితికాను పెళ్లాడాడు రోహిత్ శర్మ. వీరిద్దరి మూడేళ్ల కూతురు సమైరాకి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది...

Follow Us:
Download App:
  • android
  • ios