రావల్పిండిలో రోహిత్ శర్మ.. బుమ్రా కూడా పాకిస్థాన్ లోనే.. మన క్రికెటర్లను పోలిన వ్యక్తులను చూస్తే షాకవ్వడం ఖాయం
Cricketers Lookalike: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లి.. వీళ్లంతా ప్రస్తుతం దుబాయ్ లో ఐపీఎల్ 14 వ సీజన్ సందర్భంగా తీరికలేని షెడ్యూలు గడుపుతున్నారు. కానీ ఈ ముగ్గురు పాకిస్థాన్ లోనూ దర్శనమిస్తున్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
మనిషిని పోలిన మనుషులు ఉండటం సహజమే. ఈ భూ ప్రపంచంలో మనను పోలినవారు ఏడుగురు ఉంటారట. అయితే కొద్దిపాటి పోలికలతో కనిపించడంలో వింతేమీ లేదు. కానీ అచ్చుగుద్దినట్టు భారత క్రికెటర్లను పోలినట్టు ఉండే వీరిని చూస్తే మాత్రం మతిపోవడం ఖాయం.
ఇదిగో ఇతడిని చూడండి.. అచ్చం మన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా లా లేడు. బాడీ, ఫేస్ తో పాటు ఆహర్యంలో కూడా బూమ్రాను దింపేస్తున్న ఈ డూప్ బుమ్రా పాకిస్థాన్ కు చెందినవాడు. అతడి జెండాపై పాక్ జెండాను చూడొచ్చు.
ఇటీవల ఇంటర్నెట్ లో ఒక చిత్ర తెగ వైరల్ అయింది. పాక్ లోని రావల్పిండికి చెందిన ఒక వ్యక్తి.. ఓ షాప్ దగ్గర జ్యూస్ తాగుతూ కనిపించాడు. ఫోటో చూస్తే అచ్చం అతడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ అనే అనుమానం కలుగక మానదు. రోహిత్ శర్మను అచ్చుగుద్దినట్టు దింపేసిన ఈ వ్యక్తికి సంబంధించి నెటిజన్లు మీమ్స్ వర్షం కురిపించారు.
రోహిత్, బుమ్రా లే కాదు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని పోలిన క్రికెటర్ కూడా పాక్ లో ఉన్నాడు. అతడు ఏకంగా పాక్ క్రికెట్ జట్టులో సభ్యుడు కావడం గమనార్హం. పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ముఖం సేమ్ టు సేమ్ కోహ్లి ముఖాన్ని పోలి ఉంటుంది.
గబ్బర్ శిఖర్ ధావన్ ను పోలిన వ్యక్తి కన్నడలో ఉన్నాడు. కన్నడ చిత్రాలలో టెక్నిషియన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి .. అచ్చం ధావన్ మాదిరే ఉంటాడు.
లార్డ్ ఆఫ్ క్రికెట్ గా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్ ను పోలిన బల్బీర్ సింగ్.. ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ తో పలు యాడ్ లు కూడా చేశాడు. సచిన్ డూప్ గా చాలా యాడ్ లు చేశాడు.
టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను పోలిన జీవన్ శర్మ.. అచ్చం అతడిలాగే మాట్లాడుతాడు. శర్మది మహారాష్ట్ర.
శ్రీలంక బౌలర్, యార్కర్ కింగ్ లసిత్ మలింగ ను పోలిన ఓ వ్యక్తి ఫోటో కూడా ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేస్తోంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన మలింగ.. ఈ సీజన్ లో ఆటడం లేదు.