భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు క్రికెట్ కు సబంధించి ఇరుదేశాల మధ్య మంచి సత్సంబంధాలుండేవని... మరీ  ముఖ్యంగా ఆటగాళ్ల మధ్య మంచి స్నేహం వుండేదని పాకిస్థానీ మాజీ  క్రికెటర్ వకార్ యూనిస్ తెలిపారు. ఇలా ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య బంధం ఎలా వుండేదో తెలియజేసే ఓ సంఘటనను బైటపెట్టారు వకార్. 

''1997 లో భారత్-పాకిస్థాన్ సహారా కప్ లో తలపడ్డాయి. ఈ సందర్భంగా ఓ మ్యాచ్ లో భారత అభిమానులు తనను అవమానించేలా కామెంట్ చేసినా పట్టించుకోని పాక్ క్రికెటర్ ఇంజామామ్ తన ప్రత్యర్థి భారత జట్టు ఆటగాడి గురించి కామెంట్  చేస్తే తట్టుకోలేకపోయాడు. కోపంతో మైదానంలోనే సదరు అభిమానిపై దాడికి ప్రయత్నించి చిక్కుల్లో పడ్డాడు'' అని వకార్ పేర్కొన్నారు. 

read more   కోచ్ గా మారడానికి కారణమతడే: రాహుల్ ద్రవిడ్

'' మైదానంలోని ఓ భారత అభిమాని ఇంజమామ్ కు వినపడేలా భారత ఆటగాడు అజారుద్దిన్ భార్య గురించి అసభ్యకరంగా కామెంట్ చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఇంజీ అతడిపై మైదానంలోనే దాడికి ప్రయత్నించాడు. సదరు అభిమానిని పోడియంలోంచి మైదానంలోకి లాక్కొచ్చి మరీ బ్యాట్ తో దాడికి ప్రయత్నించాడు'' అని వెల్లడించారు. 

''ఇలా అభిమానిపై దాడికి ప్రయత్నించినందుకు ఇంజమామ్ రెండు మ్యాచ్ ల నిషేదం ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. అయితే అజారుద్దిన్ కలుగజేసుకుని సదరు అభిమానితో మాట్లాడి వివాదం సమసిపోయేలా చేశాడు'' అని వకార్ తెలిపారు.