ముంబై: దిగ్గజ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఆటగాడిగానే కాదు కోచ్ గా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం అండర్ 19, భారత 'ఎ' టీంకు కోచ్ గా యువ ఆటగాళ్ల ఆటను మరింత మెరుగుపర్చడంలో ద్రవిడ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇలా తాను కోచ్ గా మారడానికి టీమిండియా లెజెండరీ మాజీ క్రికెటర్  కపిల్ దేవ్ మాటలే కారణమని ద్రవిడ్ వెల్లడించారు. 

అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని పార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటివరకు క్రికెట్ తప్ప వేరు విషయాలు తెలియని తాను డైలమాలో పడిపోయానని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కపిల్ దేవ్ ను కలవగా ఆయన దిశానిర్దేశం చేశారు. 

read more  నవ్వుతూ రోహిత్ ఫోటో, ఇల్లు క్లీనింగ్ లేదా అంటూ చాహల్ ట్రోలింగ్

ఇప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని... తొందరపాటు నిర్ణయాలు తగదని కపిల్ తెలిపారు. కొన్నేళ్లపాటు అన్నీ ప్రయత్నించి ఏది నచ్చితే దాన్ని కొనసాగించాలని చెప్పారని... ఆ సలహానే తాను పాటించానని ద్రవిడ్ తెలిపారు. 

రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరించానని... అయితే క్రికెట్ దూరమవుతున్నానన్న భావనతో దాన్ని వదిలేసి కోచింగ్ వైపు నడిచానన్నారు.  ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా వ్యవహరించిన అనుభవంతో అండర్ 19, భారత్  ఎ జట్టుకు మెరుగైన సేవల అందిస్తున్నానని ద్రవిడ్ పేర్కొన్నారు.