టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాకి సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ షాకిచ్చింది. తనకు కాబోయే భార్య నటాషా స్టాంకోవిక్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను పాండ్యా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

అయితే ఇది తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఇన్‌‌స్టా తొలగిచించింది. అయితే మంగళవారం నటాషా మళ్లీ అదే ఫోటోను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. కానీ ఈసారి ఈ చిత్రాన్ని ఇన్‌స్టా తొలగించలేదు.

మొదటి సారి షేర్ చేసిన ఫోటో స్థానంలో మీ చిత్రం తమ కమ్యూనిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి మీ పోస్ట్‌ను తొలగించాల్సి వచ్చిందని మెసేజ్ కనిపిస్తోంది.

Also Read:హార్దిక్ పాండ్యా కొడుకు పేరు ఇదే, బహుమతి పంపిన మెర్సిడెజ్

మొదట పెట్టిన ఫోటోకు మిస్సింగ్ యూ హార్దిక్ పాండ్యా అనే క్యాప్షన్ పెట్టగా.. రెండవసారి పెట్టిన పోస్ట్‌కు నటాషా ఎలాంటి శీర్షికను తగిలించలేదు. మరోవైపు ఆ ఫోటోకు ‘‘హా హా ఐ లవ్ యూ’’ అని హార్దిక్ కామెంట్ పెట్టాడు.

కాగా నటాషా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సెర్బియన్ నటి నటాషాతో హార్డిక్ పాండ్యా ఈ ఏడాది జనవరి 1న నిశ్చితార్థమైంది. ఈ నేపథ్యంలో మే 31న తాను తండ్రిని కాబోతున్నట్లు పాండ్యా ప్రకటించాడు. అయితే పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడంతో ఈ జంటపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు.