INDW vs AUSW: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. బ్యాటింగ్ కు దిగిన భారత్ మ‌రో చ‌రిత్ర సృష్టిస్తుందా?

India Women vs Australia Women: భార‌త వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ‌హిళ క్రికెట్ వ‌న్డే మ్యాచ్ నేప‌థ్యంలో టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా చూస్తుండ‌గా, త‌న జైత్ర యాత్ర‌ను కొన‌సాగించాల‌ని భార‌త మ‌హిళ జ‌ట్టు ఉత్సాహంతో ఉంది. టాస్ గెలిచిన భార‌త్ మొద‌ట బ్యాటింగ్ కు దిగింది. 
 

INDW vs AUSW: 1st ODI against Australia,  Will India create another history when they come out to bat? RMA

India Women vs Australia Women, 1st ODI: ముంబై వేదిక‌గా జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భార‌త మ‌హిళా జ‌ట్టు బ్యాటింగ్ కు దిగింది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ముంబయి వేదికగా జరిగిన ఏకైక టెస్టులో భారత్‌ తొలిసారిగా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది. తదుపరి 3 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ముంబైలో జరగనున్నాయి. దీనితో భాగంగానే నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది.

సిరీస్ గెలిస్తే మ‌రో చ‌రిత్రే.. 

భార‌త్ ఇప్ప‌టికే టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక వ‌న్డే సిరీస్ ను కూడా ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. వ‌న్డే సిరీస్ గెలిస్తే మ‌రో చ‌రిత్ర అవుతుంది. అయితే, వ‌న్డేల్లో ఆస్ట్రేలియాపై భార‌త్ కు మెరుగైన రికార్డు లేదు. ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు ఆడిన 50 వన్డేల్లో 40 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. 10 మ్యాచ్ ల‌లో మాత్రమే విజ‌యం సాధించింది. అది కూడా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడిన గత 7 మ్యాచ్‌ల్లో భారత్‌కు కష్టాలు తప్పలేదు. కానీ, ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు మ్యాచ్ విజ‌యంతో చ‌రిత్ర సృష్టించిన భార‌త్.. వ‌న్డే సిరీస్ లో కూడా అదే జోరును కొన‌సాగించాల‌ని చూస్తోంది.

ఇటీవ‌ల ముగిసిన‌ టెస్టులో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్‌కు కూడా వారు షెల్‌కింగ్‌ను అందించారు. అయితే వైట్ బాల్ క్రికెట్‌లో ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లపై భారత్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌డంలేదు. అయితే, దాదాపు టెస్టు జ‌ట్టుతో ఉన్న భార‌త్ వ‌న్డే టీమ్ గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆస్ట్రేలియా  బ‌ల‌మైన జ‌ట్టు.. గ‌త రికార్డులు వారికే అనుకూలంగా ఉన్నాయి.

ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు వీరే.. 

భారత మహిళలు (ప్లేయింగ్ XI): జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, యాస్తికా భాటియా, రిచా ఘోష్, స్నేహ రాణా, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, రేణుకా ఠాకూర్ సింగ్, సైకా ఇషాక్

ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్, అలనా కింగ్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్

 

 

మ్యాచ్ మధ్య‌లోనే గ్రౌండ్ లో ప్రేక్ష‌కుల‌తో కలిసి స్టెప్పులేసిన క్రికెటర్.. వీడియో వైర‌ల్ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios