Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్తత... ధోని భద్రతపై స్పందించిన ఆర్మీ చీఫ్

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేేసింది.దీంత ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం వుంది. ఇలాంటి  సమయంలో ధోని  అక్కడే విధులు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదేమోనని అభిమానులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు.    

indian army chief bipin rawat  comments on dhoni security
Author
Jammu and Kashmir, First Published Aug 5, 2019, 8:21 PM IST

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ విషయంలో సంచనల నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న 370, 35ఎ నిబంధనను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ నిర్ణయానికి పార్లమెంట్  ఉభయ సభల ఆమోదం పొంది చట్టం రూపంలోకి మార్చాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇలా తమ హక్కులను హరించివేసే  నిర్ణయం వెలువడటంతో జమ్మూకశ్మీర్ ప్రజలు ఆందోళనుకు దిగే అవకాశాలున్నాయి. దీన్ని ముందుగానే గ్రహించిన కేంద్రం అక్కడ భారీగా బలగాలను మొహరించింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో తమ అభిమాన ఆటగాడి భద్రత విషయంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ధోని భద్రతపై తాజాగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించాడు. ఆర్మీ దుస్తులను ధరించి విధుల్లో చేరినప్పుడే అతడు ఎలాంటి పరిస్థితులయినా ఎదుర్కోడానికి సిద్దపడ్డాడు. కాబట్టి తాజా పరిణామాల నేపథ్యంలో అతడిలో ఎలాంటి ఆందోళన  లేదు. కాబట్టి అభిమానులు కూడా అతడిలాగే దైర్యంగా వుండాలని...  ఎలాంటి ఆందోళన అవసరంలేదని రావత్ సూచించారు. 

ధోనికి ప్రత్యేక సెక్యూరిటీ ఏమీ  కల్పించడం లేదని తెలిపారు. అతడి సహచర సైనికాధికారులకు ఎలాంటి సదుపాయాలు కల్పించామో అతడికి అవే కల్పించాం. ఉన్నతాధికారులు తనకు కేటాయించిన విధులను ధోని  సిన్సియర్ గా చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతడు తన  విధులను సమర్థవంతంగా పూర్తి చేస్తాడని నమ్ముతున్నానని రావత్ పేర్కోన్నారు. 
 
క్రికెట్ అంటే ఇష్టపడేవారంతా తనను అభిమానిస్తుంటే ధోని మాత్రం దేశ రక్షణ కోసం పాటుపడే ఆర్మీ జవాన్లను అభిమానిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి  భారత ఆర్మీతో కలిసి పనిచేయాలన్న కుతూహలం పెరిగింది. ధోని ఉత్సాహాన్ని గమనించిన ఆర్మీ ఉన్నతాధికారులు అతడికి స్పోర్ట్స్ కోటాలో లెప్టినెంట్ కల్నల్ హోదాను కల్పించారు.  ఇలా బెంగళూరు హెడ్ క్వార్టర్ గా పనిచేసే పారాచూట్ రెజిమెంట్ లో చేరిన ధోని 2015 నుండి ఇప్పటివరకు  ఐదుసార్లు పారాచూట్ జంపింగ్ లో  పాల్గొన్నాడు. ఇలా ఆగ్రా ట్రెయినింగ్ క్యాంప్ లో ఆర్మీ విమానం పై నుండి దూకి ధోని అధికారికంగా పారాట్రూపర్ గా మారాడు. 

సంబంధిత వార్తలు

కశ్మీర్ లో ఉద్రిక్తత... ఆందోళనలో ధోనీ అభిమానులు

ప్రమాదకర కాశ్మీర్ లోయలో ధోని విధులు...సెక్యూరిటీపై క్లారిటీ ఇచ్చిన ఆర్మీ చీఫ్

లెప్టినెంట్ కల్నల్ ధోనికి కాశ్మీర్ లోయలో విధులు...

Follow Us:
Download App:
  • android
  • ios