ఆస్ట్రేలియా చేతిలో భారత మహిళల జట్టు ఓటమి.. ఆరు వికెట్లతో అలవోకగా గెలిచిన కంగారూలు

భారత్ మహిళల జట్టును ఆస్ట్రేలియా టీమ్ మట్టికరిపించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ పెట్టిన 283 పరుగుల టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది.
 

india women team lost to australia, it won with 6 wickets kms

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘోర ఓటమిని చవి చూసింది. ఆరు వికెట్ల తేడాతో భారత్ పై ఆస్ట్రేలియా మహిళల జట్టు పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ ఎక్కిన భారత టీమ్ 283 పరుగుల టార్గెట్‌ను పెట్టింది. ఆస్ట్రేలియా మహిళల టీమ్ ఈ టార్గెట్‌ను అలవోకగా సాధించింది. 46.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది.

భారత మహిళల జట్టు వరుస పరాజయాలతో సతమతం అవుతున్నది. వరుసగా ఆరు మ్యాచ్‌లలోనూ మహిళల టీమిండియా జట్టు ఓడిపోయింది. ఆస్ట్రేలియా టీమ్ పై రికార్డు స్కోర్ చేసినా.. టీమిండియా ఓటమి పాలైంది. గురువారం ముంబయిలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో మహిళల భారత టీమ్ ఓడిపోయింది.

ఆస్ట్రేలియా టీమ్ ఛేదనకు దిగి.. లిచ్‌ఫీల్డ్, ఎలిస్ పెర్రీలు జట్టును విజయతీరాలకు చేర్చారు. లిచ్‌ఫీల్డ్ 78 పరుగులు, పెర్రీ 75 పరుగులు సాధించారు. రెండో వికెట్ పడే సమయంలో జట్టు స్కోర్ 148కి చేరుకుది. 46.3 ఓవర్‌లలో 4 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా టీమ్ 285 పరుగులు సాధించింది. భారత స్కోర్ 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు మాత్రమే. ఈ టార్గెట్‌ను ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది.

Also Read: India vs South Africa: సఫారీల చేతిలో టీమిండియా ఘోర పరాజయం.. ఇన్నింగ్స్ ఓటమి

భారత్ బ్యాట్స్‌విమెన్లు కూడా మంచి ప్రారంభాన్ని అందించారు. జెమిమా రోడ్రిగ్స్ 82 పరుగులు సాధించి జట్టు లక్ష్యానికి ఉపకరించారు. పూజ వస్త్రాకర్ 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. యస్తికా భాటియా హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఔట్ అయ్యారు. కానీ, భారత బౌ లర్లు మాత్రం ఆస్ట్రేలియా బ్యాట్‌విమెన్ల జైత్రయాత్రను అడ్డుకోవడంలో విఫలం అయ్యారు. అతి కష్టం మీద రేణుకా సింగ్, పూజ వస్త్రాకర్, స్నేహ రాణాలు తల ఒక వికెట్ తీసుకున్నారు.

మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆస్ట్రేలియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios