India vs South Africa: సఫారీల చేతిలో టీమిండియా ఘోర పరాజయం.. ఇన్నింగ్స్ ఓటమి

దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి టెస్టులోనే బొక్కాబోర్లా పడింది. ఏకంగా ఒక ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 
 

team india lost to south africa with a inning and 32 runs in first test match kms

India Vs South Africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇది వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలుచుకోలేకపోయింది. భారత్ టెస్టు సిరీస్ గెలుచుకోలేకపోయిన.. ఏకైక ఆతిథ్య దేశం దక్షిణాఫ్రికానే. ఈ సారికైనా భారత్ సిరీస్ కొట్టుకురావాలని క్రికెట్ అభిమానులు ఆశపడుతున్నారు. కానీ, తొలి టెస్టు మ్యాచ్‌లోనే భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా ఒకే ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులను రెండు ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా ఛేదించలేకపోయింది. సఫారీల చేతిలో ఒక ఇన్నింగ్, 32 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. మూడు రోజులకే టెస్టు విజయాన్ని దక్షిణాఫ్రికాకు అప్పగించింది. ఈ టెస్టు దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరిగింది.

తొలి టెస్టులో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసింది. 245 పరుగులతో ఫర్వాలేదనిపించింది. కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. అప్పుడు కోహ్లీ 38 పరుగులు సాధించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు సాధించింది. డీన్ ఎల్గర్ ఏకంగా 185 పరుగులు సాధించాడు. మార్కో జాన్సెన్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

Also Read: Praja Palana: అభయ హస్తం దరఖాస్తు ఫామ్ ఇలా ఉచితంగా పొందండి

భారత్ 165 పరుగుల లోటుతోనే రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లోకి దిగింది. అయితే, ఈ లోటును కూడా భారత్ పూడ్చలేకుండా ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు వేగంగా వికెట్లను సమర్పించుకున్నారు. ఒక్క విరాట్ కోహ్లీ (76 పరుగులు) మినహా ఎవరూ సఫారీల బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. శుభ్‌మన్ గిల్ 26 రన్స్‌తో సెకండ్ హైయెస్ట్‌గా నిలిచారంటే భారత బ్యాట్స్‌మెన్ల పర్ఫార్మెన్స్‌ను ఊహించుకోవచ్చు. రోహిత్, అశ్విన్, బుమ్రాలు ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు బర్గర్ 33 పరుగులు ఇచ్చి కీలకమైన 4 వికెట్లు, మార్కో జాన్సెన్ 35 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి చెలరేగిపోయారు.

రెండో టెస్టు జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios