కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలు వాయిదా పడటమో లేదంటే రద్దవ్వడమో జరుగుతోంది. దీనికి క్రికెట్ కూడా అతీతం కాదు. ఇప్పటికే ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా భారత మహిళ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన రద్దయ్యింది.

కరోనా కారణంగా అక్కడికి వెళ్లి, ఆడే పరిస్థితి లేనందున పర్యటన నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్  ప్రకారం.. జూన్‌లోనే భారత మహిళ జట్టు ఇంగ్లాండ్‌తో 3 వన్డేలు, 3 టీ20ల్లో తలపడాల్సి వుంది.

Also Read:ఐపీఎల్‌ కోసమే .. లక్షల డాలర్లే ముఖ్యం : టీ20 ప్రపంచకప్‌ వాయిదాపై అక్తర్ వ్యాఖ్యలు

అప్పుడు దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినా.. ఇప్పుడు రద్దయ్యినట్లయ్యింది. అయితే వచ్చే సెప్టెంబర్‌లోనైనా భారత్, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి టోర్నీ నిర్వహించాలని ఈసీబీ భావిస్తోంది.

కానీ భారత్‌లో కోవిడ్ విలయతాండవం నేపథ్యంలో ఈ ముక్కోణపు సిరీస్‌ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ భారత్ కనుక పర్యటనకు రాకపోతే.. దక్షిణాఫ్రికాతో కలిసి ఇంగ్లాండ్ ‌ఈ సిరీస్ ఆడే అవకాశం వుంది.