India Tour Of Ireland: క్రికెట్ లో పసికూనగా ఉన్న ఐర్లాండ్ కు టీమిండియా బంపరాఫర్ ఇచ్చింది. ఆ దేశంతో టీ20 సిరీస్ ఆడేందుకు బీసీసీఐ అంగీకారం తెలిపింది. భారత్ తో పాటు...

టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ సారథ్యంలోని యువ భారత్ వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సిరీస్ లు గెలిచి శ్రీలంకతో టెస్టు మ్యాచులకు సిద్ధమవుతున్నది. అయితే ఈ వేసవిలో భారత జట్టు.. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఐర్లాండ్ తో రెండు టీ20 లు ఆడేందుకు భారత జట్టు ఆ దేశంలో పర్యటించనున్నది. కాగా ఐర్లాండ్ కు వెళ్లనున్న భారత జట్టులో మూడు ఫార్మాట్ల సారథి రోహిత్ శర్మ తో పాటు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ రిషభ్ పంత్ లు లేకుండానే పర్యటనకు వెళ్లనున్నది. 

జూన్ 27, 28 న ఐర్లాండ్ తో భారత జట్టు రెండు టీ20 లు ఆడనున్నది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ధృవీకరించింది. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఐర్లాండ్... ‘భారత పురుషుల క్రికెట్ జట్టు ఈ జూన్ లో ఐర్లాండ్ లో పర్యటించనున్నది. 2018 తర్వాత ఐర్లాండ్ కు వస్తున్న భారత జట్టుకు సుస్వాగతం’ అని రాసుకొచ్చింది. 

Scroll to load tweet…

కాగా ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు ఇతర సీనియర్ ప్లేయర్లు అందుబాటులో ఉండేది అనుమానమే. సరిగ్గా అదే సమయానికి టీమిండియా.. గతేడాది ఇంగ్లాండ్ తో మిగిలిపోయిన ఐదో టెస్టును ఆడాల్సి ఉంది. గతేడాది నాలుగు టెస్టులు జరిగిన ఈ సిరీస్ లో ఐదో టెస్టుకు ముందు పలువురు ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి కరోనా రావడంతో దానిని అర్థాంతరంగా వాయిదా వేశారు. ఈ మ్యాచును జులై 1-5 మధ్య జరగాల్సి ఉంది. సీనియర్ ప్లేయర్లంతా ఈ మ్యాచ్ మీదే దృష్టి సారించారు. ఇప్పటికే ఈ సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. 

ఇదిలాఉండగా.. ఐర్లాండ్ తో గతంలో 2018లో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా రెండు టీ20ల సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది. ఇక భారత్ తో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాయి. ఇదే విషయమై ఆ జట్టు క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఈ వేసవిలో ఇండియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఐర్లాండ్ ోల పర్యటించనున్నాయి. అదే విధంగా ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ లో దక్షిణాఫ్రికాతో రెండు టీ20లు ఆడనున్నాము. ఐర్లాండ్ లో అతిపెద్ద అంతర్జాతీయ సీజన్ కోసం మేమెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం...’ అని పేర్కొంది.