IND vs WI 1st TEST: డొమినికా విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు రోహిత్ సేన పట్టు బిగించింది. భారత బౌల్లర దాటికి వెస్టిండీస్ కేవలం 150 పరుగులకే కుప్పకూలింది.
IND vs WI 1st TEST: భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం నుంచి డొమినికా వేదికగా టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి రోజు మ్యాచ్‌కి భారత్ పేరు పెట్టారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. కానీ .. భారత బౌలర్ల దాటికి విండీస్ జట్టు విలవిలాడింది. కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ అనంతరం బ్యాటింగ్ వచ్చిన టీమిండియా బ్యాటింగ్ కు వచ్చింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ టీమిండియాకు ఓపెనర్‌గా వచ్చారు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించారు. యశస్వి జైస్వాల్ 73 బంతులు ఎదుర్కొని.. 40 పరుగులు చేయగా.. రోహిత్ 65 బంతులు ఎదుర్కొని 30 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి మధ్య 80 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. వీరి భాగస్వామ్యాన్ని వెస్టిండీస్ బౌలర్లు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ప్రస్తుతం వెస్టిండీస్ కంటే టీమిండియా 70 పరుగులు వెనుకబడి ఉంది.
అశ్విన్ బౌలింగ్ కు వెస్టిండీస్ విలవిల
డొమినికా టెస్టులో వెస్టిండీస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత స్పిన్ బౌలర్లు అశ్విన్, జడేజా.. వెస్టిండీస్ టీంపై పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించారు. అశ్విన్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీశారు. వెస్టిండీస్ తరఫున అలీక్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. 99 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కెప్టెన్ బ్రైత్‌వైట్ కేవలం 20 పరుగులకే ఔటయ్యాడు. తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. చివర్లో కార్న్‌వాల్ 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారత్ తరఫున అశ్విన్ 24.3 ఓవర్లలో 60 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అలాగే.. 6 మెయిడెన్ ఓవర్లు వేశాడు. అశ్విన్‌కి ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైనది. అతను 700 అంతర్జాతీయ వికెట్లు పూర్తి చేశాడు. ఇక రవీంద్ర జడేజా విషయానికి వస్తే.. 14 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతను కూడా 7 మెయిడెన్ ఓవర్లు వేశాడు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
