Asianet News TeluguAsianet News Telugu

IND vs SA: సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిన బుమ్రా.. భార‌త్ టార్గెట్ 79 ప‌రుగులు

India vs South Africa Test: ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో, ఈ సిరీస్ చివ‌రి టెస్టులో తొలి రోజు ఫాస్ట్ బౌలర్ల హ‌వా కొనసాగింది. రెండో ఇన్నింగ్స్ లోనూ భాతర బౌలర్లు  ద‌క్షిణాఫ్రికాకు చుక్కలు చూపించారు. బుమ్రా 6 వికెట్లు తీసుకుని అదరగొట్టాడు.

India vs South Africa Test: Jasprit Bumrah Bags 6 As South Africa Set India 79-Run Target RMA
Author
First Published Jan 4, 2024, 3:37 PM IST

IND vs SA Test: భార‌త్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్ లో బౌల‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. బ్యాట‌ర్లు ప‌రుగులు చేయ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ తో సఫారీలను బెంబేలెత్తించాడు. కీలకమైన 6 వికెట్లు తీశాడు. దీంతో ప్రొటీస్ జట్టు 176 పరుగులకు ఆలౌట్ అయింది.  అయితే, ప్రొటీస్ జ‌ట్టు ప్లేయ‌ర్లు వ‌రుస‌గా ఫెవిలియ‌న్ క్యూ క‌ట్ట‌గా.. ఐడెన్ మార్క్‌రమ్ మాత్రం త‌న‌దైన స్టైల్లో బ్యాటింగ్ లో రాణించి సెంచ‌రీ చేశాడు. 103 బంతులు ఎదుర్కొన్న ఐడెన్ మార్క్‌రమ్ 106 ప‌రుగుల‌తో అద‌ర‌గొట్టాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి. 106 ప‌రుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

ఐడెన్ మార్క్‌రమ్ త‌ప్ప సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో మిగ‌తా ప్లేయ‌ర్లు ఎవ‌రూ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. త‌న టెస్టు కెరీర్ లో చివ‌రి మ్యాచ్ అడుతున్న డీన్ ఎల్గ‌ర్ 12 ప‌రుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా 176 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. కేప్‌టౌన్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డీన్ ఎల్గర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ నిర్ణయం ప్రొటీస్ జ‌ట్టును భారీగానే దెబ్బ‌కొట్టింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు.

ఇక భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున కగిసో రబడ, నాంద్రే బర్గర్, లుంగీ ఎంగిడీ తలో 3 వికెట్లు తీశారు. ఎంగిడీ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. ద‌క్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ లో భార‌త్ పేరిట మ‌రో చెత్త రికార్డు న‌మోదైంది. భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయింది. చివరి 6 వికెట్లు కేవలం 11 బంతుల వ్యవధిలో పడ్డాయి. ఒక్క ప‌రుగు లేకుండా 6 వికెట్లు కోల్పోయింది. ఇక సెంక‌డ్ ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్లు రాణించడంతో 176 ప‌రుగుల‌కు ప్రొటీస్ జ‌ట్టు ఆలౌట్ అయింది. బుమ్రా 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ICC RANKINGS: విరాట్ కోహ్లీకి గుడ్ న్యూస్.. రోహిత్ శ‌ర్మకు బ్యాడ్ న్యూస్..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios