ఇలాంటిది ఊహించలేదు గురు.. అందరినీ ఆశ్చర్యపరిచిన టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ !
Rahul Dravid bowling: వర్షం కారణంగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ టాస్ ఆలస్యం అయింది. ఈ క్రమంలోనే గ్రౌండ్ లోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్ ఎప్పుడూ కనిపించని విధంగా.. గ్రౌండ్ లో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
India vs South Africa test: సెంచూరియన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టుకు ముందు టాస్, ఆట ప్రారంభం ఆలస్యమవడంతో భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ గ్రౌండ్ లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడూ కనిపించని విధంగా ప్లేయర్లతో కలిసి బౌలింగ్ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతకుముందు వర్షం కారణంగా సూపర్ స్పోర్ట్ పార్కులో నీరు చేరడంతో టాస్ ఆలస్యమైంది.అయితే ఈ హైప్రొఫైల్ సిరీస్ లో తొలి బంతి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తుండగానే ద్రావిడ్ నుంచి అందరికీ ఊహించని క్రిస్మస్ కానుక లభించింది. ఆల్టైమ్ గ్రేట్ ఇండియన్ బ్యాటర్లలో ఒకరైన రాహుల్ ద్రవిడ్ మీడియం పేస్ బౌలింగ్ తో క్రికెట్ ప్రియులకు కనుల విందును అందించాడు.
టెస్టు ఆరంభానికి ముందు ఆటగాళ్లు వార్మప్ కోసం గ్రౌండ్ లోకి వెళ్లగా, వారిలో కలిసి రాహుల్ ద్రావిడ్ కూడా గ్రౌండ్ లోకి వచ్చారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో పాటు కొంతమంది మీడియం పేసర్లను పంపాడు. కీపర్ కమ్ బ్యాటర్ అయిన ద్రావిడ్ తన 16 ఏళ్ల సుదీర్ఘ భారత కెరీర్ లో ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ అవన్నీ అతని కుడిచేతి స్పిన్ కు సంబంధించినవి. తాజాగా గ్రౌండ్ లో విరాట్ కోహ్లీతో పాటు రాహుల్ ద్రావిడ్ మీడియం పేస్ బౌలింగ్ చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ద్రావిడ్ బౌలింగ్ దృశ్యాలు కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అతని మాజీ సహచరుడు సంజయ్ బంగర్ స్పందిస్తూ నాతో పాటు చాలా మంది ఇలాంటిది ఊహించలేదని ద్రావిడ్ బౌలింగ్ పై స్పందించాడు.