IND vs SA 1st Test,Day 1 Highlights: భారత్ ను దెబ్బకొట్టిన రబాడ.. కేఎల్ రాహుల్ ఫిఫ్టి.. తొలిరోజు ఆట హైలెట్స్
IND vs SA 1st Test: టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కగిసో రబడా తన స్వింగ్ బౌలింగ్ తో భారత్ దెబ్బకొట్టగా, కేఎల్ రాహుల్ 70 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
IND vs SA 1st Test, Day 1 Highlights: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మొదటి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ కు ముందు, ఆ తర్వాత వర్షం కారణంగా మొదటి రోజు ఆట త్వరగానే ముగిసింది. అంతకుముందు టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు బాల్ అదరగొట్టడంతో భారత్ ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 59 ఓవర్లలో 208/8 పరుగులతో కేఎల్ రాహుల్ (70*), మహ్మద్ సిరాజ్ (0*) క్రీజులో ఉన్నారు.
భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ డే 1 హైలెట్స్:
- టాస్ గెలిచిన సౌతాఫ్రికా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే, 10 ఓవర్లలోపే ఓపెనర్లు ఇద్దరు ఔట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్ కూడా రెండు పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కష్టాల్లో పడ్డ భారత్ ను శ్రేయాస్ అయ్యర్-విరాట్ కోహ్లీలు అదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు, విరాట్ కోహ్లీ 38 పరుగులు చేసి ఔట్ అయ్యారు. అప్పటికీ భారత్ స్కోర్ 121/6 గా ఉంది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (70*), మహ్మద్ సిరాజ్ (0*) క్రీజులో ఉన్నారు.
- సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్ లో కగిసో రబాడ మరోసారి విజృంభించాడు. ఐదు వికెట్లతో మెరిసి భారత్ ను 59 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులకే పరిమితం చేశాడు. ఐదు వికెట్లు తీసుకోవడం తన కెరీర్ లో ఇది 14వ సారి.
- భారత్ తరుపున కేఎల్ రాహుల్ మాత్రమే హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం క్రీజులో 105 బంతుల్లో 70 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ ఉన్నాడు. రబాడ, నాంద్రే బర్గర్ ల విజృంభన మధ్య యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఔట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ నాలుగో వికెట్ కు 68 పరుగులు జోడించడంతో భారత్ 91/3 స్కోరు చేసింది.
- సెకండ్ సెషన్ లో కేఎల్ రాహుల్ తో కలిసి శార్దూల్ ఠాకూర్ ఏడో వికెట్ కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ రబాడ నాలుగు వికెట్లు పడగొట్టి భారత జట్టును దెబ్బకొట్టాడు. మూడో సెషన్ లో కేవలం 9 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండగా రాహుల్ అర్ధశతకం సాధించడంతో భారత్ మెరుగైన స్కోర్ దిశగా ముందుకు సాగింది. అయితే, మార్కో జాన్సన్ చేతిలో జస్ప్రీత్ బుమ్రా చిక్కడంతో ఆ సెషన్లో ఒక వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది.
- అంతకుముందు బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ టెంబా బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి సెషన్ లో గాయపడ్డ బవుమా 20వ ఓవర్ లో డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి తిరిగి మైదానంలోకి రాలేదు.
- దక్షిణాఫ్రికా తరఫున నాంద్రే బర్గర్, డేవిడ్ బెడింగ్‌హామ్ ఇద్దరు అరంగేట్ర ప్లేయర్స్. నలుగురు బౌలర్లతో బరిలోకి దిగారు. రవిచంద్రన్ అశ్విన్ కు అవకాశం దక్కడంతో రవీంద్ర జడేజాను ప్లేయింగ్ 11 నుంచి తప్పించారు. భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణతో పాటు శార్దూల్, సిరాజ్, బుమ్రా పేసర్లతో భారత్ బరిలోకి దిగింది.
- ఇండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
- దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11: డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా, కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్నే, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నాంద్రే బర్గర్
Aadudam Andhra: 'ఆడుదాం ఆంధ్ర'కు భారీ ఏర్పాట్లు.. 9,043 గ్రౌండ్స్ లో పోటీలు
- IND vs SA 1st Test live streaming
- IND vs SA highlights
- IND vs SA highlights today
- IND vs SA live telecast
- IND vs SA live toss
- IND vs SA live toss time
- India cricket news
- India highlights
- India tour of South Africa 2023-24
- India vs South Africa 1st Test
- India vs South Africa 1st Test Day 1 live streaming
- India vs South Africa 1st test live telecast
- India vs South Africa final Playing 11
- India vs South Africa highlights
- India vs South Africa highlights 2023
- India vs South Africa highlights today
- India vs South Africa live toss
- KL Rahul
- Kagiso Rabada
- Nandre Burger
- Rohit Sharma
- South Africa cricket news
- Virat Kohli
- cricket news
- sports news