Aadudam Andhra: 'ఆడుదాం ఆంధ్ర'కు భారీ ఏర్పాట్లు.. 9,043 గ్రౌండ్స్ లో పోటీలు

Aadudam Andhra: డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో క్రీడా సంబురాలు నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే 122.85 లక్షల మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకోగా, దాదాపు రూ.12 కోట్ల బ‌హుమ‌తులు అందించ‌నున్నారు. 
 

CM YS Jagan Mohan Reddy govt prepares 9,043 sports grounds for aadudam andhra mega sports event RMA

Aadudam Andhra: గ్రామస్థాయిలో యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని తీర్చిదిద్ది జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించడమే లక్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. దీని కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాష్ట్రవ్యాప్తంగా యువ‌త ముఖ్యంగా క్రీడాకారుల‌కు ప్రోత్సాహం అందిస్తూ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా సంబురాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు ఆడుదాం ఆంధ్ర మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ను మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఘ‌నంగా ప్రారంభించ‌నున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మంగళవారం ప్రారంభించనున్న ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ ఈవెంట్ లో భాగంగా గ్రామ సచివాలయం నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడా పోటీల నిర్వహణకు 14,997 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,043 స్పోర్ట్స్ గ్రౌండ్స్ ను సిద్దం చేసిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఇందులో గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్, కాలేజీల గ్రౌండ్స్, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్‌ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ఈ ఈవెంట్ లో భాగంగా మొత్తం 2.99 ల‌క్ష‌ల మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో 1.50 ల‌క్ష‌లు, 680 మండ‌లాల్లో 1.42 ల‌క్ష‌ల మ్యాచ్ లు, మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 5250 మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.

ఆయా స్థాయిల‌లో విజేత‌లుగా నిలిచిన వారు జిల్లా స్థాయిలో 26 జిల్లాల్లో జ‌రిగే 312 మ్యాచ్ ల్లో ఆడిన త‌ర్వాత‌, రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్ ల్లో పోటీలు నిర్వ‌హించున్నారు. ఈ క్రీడ‌ల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో, బ్యాడ్మింటన్ స‌హా ఇత‌ర క్రీడ‌లు కూడా ఉన్నాయి. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ పోటీలు జరుగుతాయ‌నీ, ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఇప్పటివరకు 122.85 లక్షల మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని అధికార వ‌ర్గాలు తెలిపాయి. ప్రైజ్ మనీ విషయానికి వస్తే నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రూ.12 కోట్లకు పైగా నగదు బహుమతులు, ఇతర అద్భుతమైన బహుమతులను, ప్ర‌శంస  ప‌త్రాలు అందజేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios