మౌంట్ మాంగనూయ్: టీమిండియా 31 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ ద్వారా తొలిసారి కోల్పోయింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాపై మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. గత 31 ఏళ్ల క్లీన్ స్వీప్ ద్వారా ఇండియా సిరీస్ కోల్పోయిన సందర్భం లేదు. ఇదే తొలిసారి.

హెన్రీ నికోలస్ 103 బంతుల్లో 80 పరుగులు, గ్రాండ్ హోమ్ 28 బంతుల్లో 58 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ ఇండియాపై ఐదు వికెట్ల తేడాతో మూడో వన్డేలో విజయం సాధించింది. భారత్ తమ ముందు ఉంచిన 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నికోలస్, గుప్తిల్ సంయమనంతో ఆడి విజయానికి బాటలు వేశారు. 

Also Read: టీ20 పరాజయానికి ఇండియాపై స్వీట్ రివెంజ్: వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్

1989 తర్వాత ఇండియా క్లీన్ స్వీప్ ద్వారా వన్డే సిరీస్ ను కోల్పోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 1989లో వెస్టిండీస్ పై భారత్ క్లీన్ స్వీప్ ద్వారా సిరీస్ ను కోల్పోయింది.

ఇండియా వైట్ వాష్ అయిన 3+ వన్డేల సిరీస్ లు ఇవే...

వెస్టిండీస్ పై 0-5, 1983/84
వెస్టిండీస్ పై 0-5, 1988/89
న్యూజిలాండ్ పై 0-3 2019/20

గమనిక: దక్షిణాఫ్రికాపై 0-4తో 2006/07లో సిరీస్ ఓటమి, ఓ వన్డే మ్యాచ్ జరగలేదు.

Also Read: కివీస్ వర్సెస్ ఇండియా: 21 ఏళ్ల తర్వాత సెంచరీతో కేఎల్ రాహుల్ రికార్డు

న్యూజిలాండ్ పై ముడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా టాపార్డర్ కుప్ప కూలింది. పృథ్వీ షా ఫరవా లేదనిపించాడు. కేఎల్ రాహుల్ సెంచరీ చేసాడు. శ్రేయస్ అయ్యర్ 62 పరుగులు చేశాడు. భారత్ ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.