India vs England : భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీతో చెల‌రేగాడు. త‌న టెస్టు క్రికెట్ కెరీర్ లో 11వ సెంచ‌రీ సాధించాడు.   

Rohit Sharma : రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ సెంచ‌రీ కొట్టాడు. తొలి 10 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్లు కోల్పోయి భార‌త్ క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ నిల‌క‌డగా ఆడుతూ సెంచ‌రీతో కొట్ట‌డం విశేషం. సెంచ‌రీ త‌ర్వాత మార్క్ వుడ్ బౌలింగ్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 196 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శ‌ర్మ 131 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు.

Scroll to load tweet…

 ఈ మ్యాచ్ ప్రారంభం అయిన అరగంటలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రజత్ పటిదారు లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ భారత ఇన్నింగ్స్ ను దారిలోకి తీసుకువచ్చాడు. భారత ఆల్ రౌండర్ జడేజాతో కలిసి రికార్డు భాగస్వామ్యంతో భారత్ నిలబెట్టాడు. నాలుగో వికెట్ అత్యుత్తమ భాగస్వామ్య రికార్డును నమోదుచేసిన క్లబ్ లో చేరారు. రోహిత్ శర్మ - రవీంద్ర జడేజాలు 4వ వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. నాల్గవ వికెట్ కు టీమిండియా తరఫున అత్యధిక భాగస్వామ్యం సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. వీరిద్దరు 249 పరుగుల భాగస్వామ్యం 2002లో సాధించారు.