India vs England: భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లీష్ బ్యాట‌ర్ ఓలీ పోప్ త‌న అద్భుత‌మైన ఆట‌ను ఆడాడు కానీ, జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో స్విప్ షాట్ ఆడ‌బోయి బౌల్డ్ అయి 4 పరుగుల దూరంలో డ‌బుల్ సెంచ‌రీని కోల్పోయాడు. భార‌త్ ముందు 231 పరుగులు టార్గెట్ ను ఉంచింది ఇంగ్లాండ్.

IND v ENG : హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు సాగిన ఆటలో భార‌త్ పై చేయి సాధించిందనే చెప్పాలి. అయితే, 140 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లోప‌డ్డ ఇంగ్లాండ్ ను ఓలీ పోప్ త‌న అద్భుత‌మైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ టీమ్ మంచి స్కోర్ ను సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే, అత‌ను త‌న డ‌బుల్ సెంచ‌రీని కోల్పోయాడు. ఓలీ పోప్ త‌న అద్భుత‌మైన ఆట‌ను ఆడాడు కానీ, జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో స్విప్ షాట్ ఆడ‌బోయి బౌల్డ్ అయి 4 ప‌రుగుల దూరంలో డ‌బుల్ సెంచ‌రీని కోల్పోయాడు.

Scroll to load tweet…

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 420 ప‌రుగులు చేశారు. ఇంగ్లాండ్ బ్యాట‌ర్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ 196 ప‌రుగులు చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 3, ర‌వీంద్ర జ‌డేజా 2 వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్ ఇప్పుడు భారత్‌కు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

India vs England: రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన అభిమానికి 14 రోజుల రిమాండ్ !

Scroll to load tweet…

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 436 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియాకు 190 ప‌రుగుల అధిక్యం ల‌భించింది. భార‌త ప్లేయ‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ 80 ప‌రుగులు, కేఎల్ రాహుల్ 86 ప‌రుగులు, ర‌వీంద్ర జ‌డేజా 87, శ్రీఖ‌ర్ భ‌ర‌త్ 41 ప‌రుగులు, అక్ష‌ర్ ప‌టేల్ 44 ప‌రుగులతో బ్యాట్ తో రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో రూట్ 4 వికెట్లు, రెహాన్ అహ్మద్ 2, టామ్ హార్ట్లీ 2, జాక్ లీచ్ ఒక వికెట్ తీసుకున్నారు. 

ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ గ‌మ‌నిస్తే.. తొలి ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ 70 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ 196 ప‌రుగులు చేయ‌గా, బెన్ డకెట్ 47, టామ్ హార్ట్లీ 34, బెన్ ఫోక్స్ 34 ప‌రుగులు చేశారు. 

India vs England: ఉప్పల్ టెస్టు మ్యాచ్ కు మస్తు క్రేజ్.. గ్రౌండ్ కు పొటెత్తిన క్రికెట్ లవర్స్ !