Asianet News TeluguAsianet News Telugu

India vs England: పీక‌ల్లోతు క‌ష్టాల్లో భార‌త్.. పెవిలియన్ కు క్యూ కట్టిన ఆటగాళ్లు !

India in trouble: హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టుల్లో భార‌త బ్యాట‌ర్స్ వ‌రుసగా పెవిలియ‌న్ కు క్యూక‌ట్టారు. 231 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. 119 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 6 వికెట్లు కోల్పోయింది. 
 

India vs England: India in trouble, 6 wickets down, Uppal Cricket Stadium RMA
Author
First Published Jan 28, 2024, 3:21 PM IST

India vs England: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో  భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ లో భార‌త్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్.. ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ల దెబ్బ‌కు భార‌త బ్యాట‌ర్స్ వ‌రుసగా పెవిలియ‌న్ కు క్యూక‌ట్టారు. 231 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. 107 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 5 వికెట్లు కోల్పోయింది. మ‌రో 12 పరుగుల త‌ర్వాత జ‌డేజా రూపంలో 6వ వికెట్ ను కోల్పోయింది. 

231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లు మంచి ఓపెనింగ్ ను అందించారు. జైస్వాల్ 15 పరుగులు చేసి ఔట్ కాగా, రోహిత్ శర్మ 39 పరుగులు చేసి టామ్ హార్టీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరోసారి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా శుభ్ మన్ గిల్ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక అక్షర్ పటేల్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నిలకడగా ఇన్నింగ్స్ ను ప్రారంబి 22 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ను రూట్ దెబ్బకొట్టాడు. దీంతో భారత్ 32.4 ఓవర్లలో 107 పరుగులు చేసి 5వ వికెట్ ను కోల్పోయింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్ కు దిగిన ర‌వీంద్ర జ‌డేజా 119 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ అయ్యాడు.  ప్రస్తుతం శ్రేయాస్ అయ్యార్, కేఎస్ భ‌ర‌త్ క్రీజులో ఉన్నారు. భారత్ గెలవడానికి ఇంకా 112 పరుగులు చేయాల్సివుంది. 

India vs England: అశ్విన్-జ‌డేజా జోడీ చెత్త రికార్డు..

 

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 420 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్ల‌లో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 3, ర‌వీంద్ర జ‌డేజా 2 వికెట్లు తీసుకున్నారు. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 436 ప‌రుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ను 119/6 (39 ఓవ‌ర్లు) ప‌రుగుల‌తో కొన‌సాగిస్తోంది. 
AUS VS WI: షమర్ జోసెఫ్ విశ్వ‌రూపం.. ఆస్ట్రేలియాను చిత్తుచేసిన వెస్టిండీస్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios