AUS vs WI: షమర్ జోసెఫ్ విశ్వరూపం.. ఆస్ట్రేలియాను చిత్తుచేసిన వెస్టిండీస్
Australia vs West Indies: 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాను వెస్టిండీస్ చిత్తు చేసింది. 215 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు నాలుగో రోజు చివరి ఇన్నింగ్స్ లో షమర్ జోసెఫ్ విజృంభించి 7 వికెట్లు పడగొట్టడంతో కంగారు టీమ్ 207 పరుగులకే ఆలౌటైంది.
West Indies vs Australia: సొంతగడ్డపై ఆస్ట్రేలియా టీమ్ ను వెస్టిండీస్ కంగారెత్తించింది. 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాను వెస్టిండీస్ చిత్తు చేసింది. 215 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు నాలుగో రోజు చివరి ఇన్నింగ్స్ లో షమర్ జోసెఫ్ విజృంభించి 7 వికెట్లు పడగొట్టడంతో కంగారు టీమ్ 207 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ టెస్టులో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 2003 తర్వాత ఆసీస్ పై విండీస్ కు ఇదే తొలి టెస్టు విజయం కాగా, 1997 తర్వాత డౌన్ అండర్ లో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అలాగే, డే నైట్ టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి కావడం విశేషం. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ యంగ్ ప్లేయర్ షమర్ జోసెఫ్ చివరి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
NDIA VS ENGLAND: అశ్విన్-జడేజా జోడీ చెత్త రికార్డు..
తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ఆధిక్యం సాధించింది. బ్రిస్బేన్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 311/10 పరుగులు చేయడంతో టాప్ ఆర్డర్ పతనం తర్వాత కవేమ్ హాడ్జ్ (71), జాషువా డా సిల్వా (78) రాణించి జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 289/9 పరుగులకు డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా (75), అలెక్స్ క్యారీ (65), ప్యాట్ కమిన్స్ (64*) రాణించడంతో ఆస్ట్రేలియా 289/9 వద్ద డిక్లేర్ చేసింది. విండీస్ రెండో ఇన్నింగ్స్ 193 పరుగుల వద్ద ముగిసింది.
India vs England: ఉప్పల్ టెస్టు మ్యాచ్ కు మస్తు క్రేజ్.. గ్రౌండ్ కు పొటెత్తిన క్రికెట్ లవర్స్ !
ఇక 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను వెస్టిండీస్ యంగ్ ప్లేయర్ షమర్ జోసెఫ్ దెబ్బకొట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 60/2తో ఉండగా, నాల్గో రోజు స్మిత్, కామెరూన్ గ్రీన్ (42) ల 72 పరుగుల భాగస్వామ్యం ఆసీస్ స్కోరును 100 దాటగా, షమర్ జోసెఫ్ ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు 172/7కే పరిమితమైంది. ఆ తర్వాత తన అద్భుత బౌలింగ్ షమర్ జోసెఫ్ ఆస్ట్రేలియా ప్లేయర్లను దెబ్బకొట్టి మొత్తంగా ఏడు వికెట్లు తీసుకుని కంగారుల పతనాన్ని శాసించాడు. విండీస్ గెలుపుతో చివరకు స్మిత్ 91* పరుగులు వృథా అయింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ సిరీస్ 1-1తో సమం అయింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ చేసిన షమర్ జోసెఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నిలవడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కూడా అవార్డు అందుకున్నాడు.
India vs England: రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన అభిమానికి 14 రోజుల రిమాండ్ !