India vs England: ఇదిగో జైస్‌బాల్.. ! 'బాజ్‌బాల్' ఎక్కడ?

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ బ్యాట్ తో అద‌ర‌గొట్టాడు. ఈ క్ర‌మంలోనే 'జైస్‌బాల్ ఇదిగో.. మ‌రి ఇంగ్లాండ్ బాజ్ బాల్ ఎక్క‌డ?' అంటూ సోష‌ల్ మీడియా కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.
 

India vs England: Here's Jaisball, Where's the 'Bazball'? Yashasvi Jaiswal KL Rahul RMA

India vs England - Bazball Jaisball: భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైద‌రాబాద్ వేదిక‌గా ప్రారంభం అయింది. అయితే, ఆట తొలిరోజు ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. అయితే, విజ‌య‌వంత‌మైన బాజ్ బాల్ వ్యూహంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ టీమ్ పెద్ద‌గా ప‌రుగులు సాధించ‌లేక‌పోయింది. తమ విజ‌య‌వంత‌మైన బాజ్ బాల్ వ్యూహం ఫ‌లించ‌లేదు. ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ల‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్ర‌మే బ్యాట్ తో రాణించి 88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 64.1 ఓవ‌ర్లు ఆడి 246 పరుగులకు ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు.

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త్ మంచి శుభారంభం ల‌భించింది. అయితే, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 24 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఆట‌ ఆరంభం నుంచే తనదైన ఆటతీరును అద‌ర‌గొట్టాడు. బౌండ‌రీలు బాదులు ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. త‌న‌దైన దూకుడు ఆట‌తో మెరిశాడు. 74 బంతుల్లో 80 ప‌రుగులు సాధించాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 10 బౌండ‌రీలు, 3 సిక్స‌ర్లు ఉన్నాయి.

 

భార‌త్-ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభం ముందు బాజ్ బాల్ గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. బాజ్ బాల్ వ్యూహంతో టెస్టు క్రికెట్ లో దూకుడుగా ఆడుతూ.. విజ‌యంత‌మైంది ఇంగ్లాండ్ టీమ్. కానీ భార‌త్ లో బాజ్ బాల్ వ్యూహం ఇదివ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బాజ్ బాల్ వ్యూహం ఫ‌లించ‌లేదు. కానీ, భార‌త్ ప్లేయ‌ర్ జైస్వాల్ దూకుడుతో ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నాడు. దీంతో సోష‌ల్ మీడియాలో జైస్వాల్ ఆట తీరును  జైస్‌బాల్ అభివ‌ర్ణిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఇంగ్లాండ్ బాజ్ బాల్ ఎక్క‌డ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిగో జైస్‌బాల్.. మ‌రి ఇంగ్లాండ్ బాజ్ బాల్ ఎక్క‌డ అంటూ య‌శస్వి జైస్వాల్ ఆట‌ను ప్ర‌స్తావిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

 

కాగా, హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246 ప‌రుగులు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్ర‌మే ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ల‌లో బ్యాట్ తో (70 ప‌రుగులు) రాణించాడు. మిగ‌తా ప్లేయ‌ర్లు నిరాశ‌ప‌రిచారు. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ 80 ప‌రుగులు, కేఎల్ రాహుల్ 86 ప‌రుగులు, శ్రీఖ‌ర్ భ‌ర‌త్ 41 ప‌రుగులు చేసి ఔట్ అయ్యారు. ర‌వీంద్ర జ‌డేజా 61* ప‌రుగులు, అక్ష‌ర్ ప‌టేల్ 4* ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. భార‌త్ 93.3 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 367 ప‌రుగులతో ఆట‌ను కొన‌సాగిస్తోంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios