మాంచెస్టర్‌లో మొదటి రోజు ఆటను భారత్ 264/4 పరుగులతో ముగించింది. వెలుతురు తగ్గిపోవడంతో ఆటను నిలిపివేశారు.
భారత్ : 264/4
రవీంద్ర జడేజా (19 నాటౌట్)
శార్దూల్ ఠాకూర్ (19 నాటౌట్)
- టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
- ప్రారంభ సెషన్‌లో ఒక్క వికెట్ కూడా ఇంగ్లాండ్ కు దక్కలేదు.
- భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (58 పరుగులు), కేఎల్ రాహుల్ (46 పరుగులు) కలిసి 94 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌కు శుభారంభం ఇచ్చారు.
- లంచ్ తరువాత ఇంగ్లాండ్ పుంజుకుని కీలకమైన మూడు వికెట్లు పడగొట్టింది.
- సాయ్ సుదర్శన్ టెస్ట్ కెరీర్‌లో తన తొలి హాఫ్ సెంచరీ (61 పరుగులు) నమోదు చేశారు.
