Who Is Anshul Kamboj: భారత జట్టులోకి కొత్త ప్లేయర్.. ఎవరీ అన్షుల్ కాంబోజ్?
Who Is Anshul Kamboj: చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ అన్షుల్ కాంబోజ్ ఇంగ్లాండ్‌పై మాంచెస్టర్ టెస్టులో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అసలు ఎవరీ అన్షుల్ కాంబోజ్? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అన్షుల్ కంబోజ్ టెస్ట్ అరంగేట్రం.. మాంచెస్టర్‌లో భారత్‌కు కొత్త బలం
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మాంచెస్టర్ వేదికగా నాల్గో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు తరఫున కొత్త ప్లేయర్ అరంగేట్రం చేశాడు.
దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టిన అన్షుల్ కాంబోజ్ టీమిండియాలోకి ప్రవేశించాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఐపీఎల్‌లో మెరిసిన ఈ 24 ఏళ్ల పేసర్‌కు ఇది మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్.
బౌలర్ల గాయాలతో అన్షుల్ కాంబోజ్ కు దక్కిన ఛాన్స్
ఆకాశ్ దీప్ లార్డ్స్ టెస్ట్ నాల్గో రోజు గ్రోయిన్ గాయం కారణంగా మాంచెస్టర్ టెస్టుకు దూరం అయ్యాడు. అలాగే, అర్షదీప్ సింగ్ సైతం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. దీంతో అన్షుల్ కాంబోజ్‌కు జట్టులో అవకాశం దక్కింది.
బీసీసీఐ అధికారికంగా ప్రకటించే ముందే కాంబోజ్ సోదరుడు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా ఈ యువ పేసర్‌కు టెస్ట్ క్యాప్ అందజేశారు.
Test Cap number 3⃣1⃣8⃣ 🙌
Congratulations to Anshul Kamboj, who is all set to make his international Debut! 👏👏
Updates ▶️ https://t.co/L1EVgGu4SI#TeamIndia | #ENGvINDpic.twitter.com/ntZRqsxczF— BCCI (@BCCI) July 23, 2025
దేశవాళీ క్రికెట్ నుండి భారత్ ఏ జట్టు వరకు.. అన్షుల్ కాంబోజ్ అద్భత బౌలింగ్ ప్రదర్శనలు
అన్షుల్ కాంబోజ్ దేశవాళీ క్రికెట్ లో అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనలతో దుమ్మురేపాడు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది రంజీ ట్రోఫీలో కేరళపై ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు రంజీలో 6 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు సాధించాడు.
భారత్ ఏ జట్టు తరఫున ఇటీవల ఇంగ్లాండ్ టూర్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. జూన్ 6 నుంచి 9 వరకు జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులతో అజేయంగా నిలిచి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని కూడా చూపించాడు.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్ తరఫున ఆడిన అన్షుల్ కాంబోజ్
మొదట ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అన్షుల్ కాంబోజ్ ను 2025 మెగా వేలంలో ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసిన కాంబోజ్‌పై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసలు కురిపించారు. అతని స్వింగ్, శాంతమైన స్వభావం ఇంగ్లాండ్ పరిస్థితులకు బాగా సరిపోతుందని అన్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అన్షుల్ కాంబోజ్ రికార్డులు ఇవే
అన్షుల్ కాంబోజ్ 2022 ఫిబ్రవరిలో తన మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో (హర్యానా vs త్రిపుర) 29 పరుగులు చేశాడు. వికెట్లు మాత్రం తీయలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మన్ పృథ్వీ సింగ్‌ను గోల్డెన్ డక్‌గా అవుట్ చేశాడు. మొత్తంగా 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 79 వికెట్లు తీశాడు, 486 పరుగులు చేశాడు. రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఇచ్చాడు.
ఫస్ట్ క్లాస్ (First Class) క్రికెట్ లో 41 ఇన్నింగ్స్ లలో 79 వికెట్లు తీయగా, బెస్ట్ 10/49 గా నమోదుచేశాడు. లిస్ట్ Aలో 25 మ్యాచ్‌లు ఆడి 40 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ 4/22 వికెట్లు.
టీ20 క్రికెట్ లో 19 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు తీసుకున్నాడు. అతని బెస్ట్ 3/12 వికెట్లు.ఐపీఎల్ లో 11 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ బౌలింగ్ 3/13 వికెట్లు.