Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ ను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి వెళ్లిన అశ్విన్.. !

India vs England - Ashwin: భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 500+ వికెట్లు తీసుకున్న రెండో బౌల‌ర్ గా నిలిచాడు. 
 

India vs England 3rd Test: Ravichandran Ashwin Withdraws Due to Family Emergency After 500th Wicket RMA
Author
First Published Feb 17, 2024, 7:59 AM IST | Last Updated Feb 17, 2024, 7:59 AM IST

IND vs ENG - Ravichandran Ashwin: రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్ ను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి వెళ్లాడు భార‌త స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్. ఈ మ్యాచ్ కు పూర్తిగా దూరం అయ్యాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి భారత ఆఫ్‌స్పిన్నర్ ఆర్ అశ్విన్ వైదొలిగాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ మ్యాచ్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఒక వికెట్ తీసుకోవ‌డంతో టెస్టు క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన బౌల‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. అత్యంత వేగంగా 500 వికెట్లు తీసుకున్న రెండో బౌల‌ర్ గా రికార్డు సృష్టించాడు.

ఈ ఘ‌న‌త సాధించిన త‌ర్వాత బీసీసీఐ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఈ టెస్టు మ్యాచ్ కు దూరం అవుతున్నాడ‌ని ప్ర‌క‌టించింది. "రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ జట్టు నుండి వైదొలిగాడు, ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా వెంట‌నే ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వస్తుంది" అని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ స‌మ‌యంలో బీసీసీఐ, టీమిండియా అశ్విన్ కు పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని పేర్కొంది. అయితే, అశ్విన్ త‌ల్లి అనారోగ్యంతో ఉన్నార‌నీ, అందుకే ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడ‌ని స‌మాచారం. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా  ఎక్స్ లో చేసిన ఒక పోస్టులో "ఆర్ అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అతను తన తల్లితో ఉండటానికి రాజ్‌కోట్ టెస్టు నుంచి చెన్నైకి బయలుదేరాలి" అని పేర్కొన్నాడు.

IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన అశ్విన్.. దిగ్గ‌జాల రికార్డులు బ్రేక్.. !

బీసీసీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో "చాంపియన్ క్రికెటర్, అతని కుటుంబానికి బీసీసీఐ తన హృదయపూర్వక మద్దతును అందిస్తుంది. ఆటగాళ్లు, వారి ప్రియమైనవారి ఆరోగ్యం-శ్రేయస్సు చాలా ముఖ్యమైనది. బోర్డు గోప్యతను గౌరవించమని అభ్యర్థిస్తుంది. అశ్విన్-అతని కుటుంబంతో అండ‌గా ఉంటామ‌నీ, అవ‌స‌ర‌మైన సాయాన్నిఅందిస్తామ‌ని" తెలిపింది.

 

IND VS ENG: సెంచ‌రీ కోసం సర్ఫరాజ్ ఖాన్ ను బ‌లి చేశావా జ‌డ్డూ భాయ్.. ! రోహిత్ శ‌ర్మ కోపం చూశారా..?

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios