11:23 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live 251/4 పరుగులతో డే 1ను ముగించిన ఇంగ్లాండ్.. జోరూట్ 99*

3వ టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 251/4 పరుగులతో నిలిచింది. 

జో రూట్ 99*, బెన్ స్టోక్స్ 39* పరుగులతో క్రీజులో ఉన్నారు. 

నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నాడు. జడేజా, బుమ్రాలు చెరో వికెట్ పడగొట్టారు.

Scroll to load tweet…

Scroll to load tweet…

09:50 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live 200 పరుగులు దాటిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ 200 పరుగులు పూర్తి చేసింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ సింగిల్ తీసి జట్టుకు 200 పరుగుల మార్కును అందించాడు.

ఇంగ్లండ్ 204/4 (66.2)

జో రూట్: 74*

బెన్ స్టోక్స్: 20*

09:44 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live హ్యారీ బ్రూక్ అవుట్.. బుమ్రాకు తొలి వికెట్

హ్యారీ బ్రూక్ ను క్లీన్‌బౌల్డ్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. దీంతో ఇంగ్లాండ్ నాల్గో వికెట్ కోల్పోయింది. బ్రూక్ 11 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

ఇంగ్లండ్ : 172/4

08:50 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live ఓలీ పోప్ అవుట్.. ఇండియాకు బ్రేక్ త్రూ అందించిన జడేజా

రవీంద్ర జడేజా కీలక సమయంలో భారత జట్టుకు బ్రేక్‌త్రూ అందించాడు. ఓలీ పోప్ ను 44 పరుగుల వద్ద అవుట్ చేశాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. 

ఇంగ్లాండ్ స్కోర్: 153/3

Scroll to load tweet…

08:13 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live హాఫ్ సెంచరీ కొట్టిన జో రూట్

లార్డ్స్ లో జో రూట్‌ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 67వ హాఫ్ సెంచరీ.

నితీష్ రెడ్డి బౌలింగ్ లో బౌండరీ కొట్టి ఈ మైలురాయిని అందుకున్నాడు.

ఇంగ్లాండ్ స్కోరు: 140/2

Scroll to load tweet…

07:28 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live రిషబ్ పంత్ కు గాయం

లార్డ్స్ టెస్టులో రిషబ్ పంత్ గాయపడ్డారు. రెండో సెషన్‌లో వేలు గాయం కారణంగా పంత్ గ్రౌండ్ ను వీడారు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేస్తున్నారు.

06:28 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live లార్డ్స్‌ టెస్టులో తెలుగు ప్లేయర్ డబుల్ హిట్.. ఇంగ్లాండ్ కు నితీశ్ రెడ్డి షాక్

IND vs ENG: లార్డ్స్‌లో జరుగుతున్న మూడవ టెస్టులో ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. తొలి సెషన్ లోనే భారత్ కు రెండు కీలక వికెట్లు అందించాడు.

Read Full Story
05:52 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ 83/2 పరుగులు

ఇంగ్లాండ్ స్కోర్: 83/2 (25 ఓవర్లు)

రన్ రేట్ (CRR): 3.32

• ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయింది.

• ప్రస్తుతం క్రీజులో ఓలీ పోప్ (12 పరుగులు), జో రూట్ (24 పరుగులు) ఉన్నారు.

• ఒకే ఓవర్ లో నితీష్ కుమార్ రెడ్డి రెండు కీలక వికెట్లు తీశారు.

• బుమ్రా అద్భుతంగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.

Scroll to load tweet…

04:55 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live లార్డ్స్‌లో టాస్ పడిన వెంటనే ఈ ప్లేయర్ కు షాక్ తగిలింది !

India vs England 3rd Test: ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య గురువారం ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ లు ప్లేయింగ్ ఎలెవన్ లో చోటుదక్కించుకున్నారు. టాస్ పడిన వెంటనే ఒక ప్లేయర్ కు షాక్ తగిలింది.

Read Full Story
04:49 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఇంగ్లాండ్ కు బిగ్ షాక్

నితీస్ కుమార్ రెడ్డి తన తొలి ఓవర్ లోనే భారత్ రెండు వికెట్లు అందించాడు. ఈ మ్యాచ్ లో 14 ఓవర్ వేసిన నితీస్ కుమార్ రెడ్డి.. మూడో బంతికి బెన్ డకెట్ (23 పరుగులు) ను అవుట్ చేశాడు. అదే ఓవర్ లో చివరి బంతికి జాక్ క్రాలీని (18 పరుగులు) పెవిలియన్ కు పంపాడు. 

ఇంగ్లాండ్: 44-2 (15 ఓవర్లు)

ఓలీ పోప్, జో రూట్ క్రీజులో ఉన్నారు. 

Scroll to load tweet…

03:50 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live లార్డ్స్ టెస్టుపై శుభ్‌మన్ గిల్ కామెంట్స్ వైరల్

“ఈ ఉదయం వరకు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాము. మొదటి సెషన్‌లో పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అనిపించింది. ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మా బౌలర్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. జట్టులో ఒక మార్పు చేశాము. ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చారు” అని భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ చెప్పారు.

“మేము బ్యాటింగ్ చేస్తాము. సాధారణంగా ఈ పిచ్ మొదటి గంటలో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. బాగా పోటీగా సాగుతున్న సిరీస్ ఇది. గత మ్యాచ్ ఓడినా.. ఈ మ్యాచ్ కు మేము పూర్తి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికీ లార్డ్స్‌లో ఆడటం ఇష్టం.. జట్టులో ఒక మార్పు చేశాము. జోస్ టంగ్ స్థానంలో ఆర్చర్ జట్టులోకి వచ్చారు” అని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపారు.

Scroll to load tweet…

03:41 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రా

భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవకాశం.

ఇంగ్లాండ్ జట్టు: జోఫ్రా ఆర్చర్ నాలుగు సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చారు.

03:33 PM (IST) Jul 10

India vs England 3rd Test Day 1 Live టాస్ గెలిచిన ఇంగ్లాండ్

India vs England 3rd Test Day 1 Live : టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

మూడో టెస్టులో ఆడుతున్న ఇరు జట్ల ప్లేయింగ్ 11: 

ఇండియా: 

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్ మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్( వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్:

 జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వైస్ ప్టెన్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్

Scroll to load tweet…