India vs England 1st test Live day 1:భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల, 246 పరుగులకు అలౌట్
హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు.
హైదరాబాద్: భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు విలవిలలాడింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ గురువారంనాడు హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్ మెన్ భారత భౌలర్ల దెబ్బకు పెవిలియన్ కు క్యూ కట్టారు. ముగ్గురు స్పిన్నర్లతో భారత జట్టు బరిలోకి దిగింది. భారత స్పిన్నర్ల మాయాజాలానికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ తోక ముడిచారు.
ఇవాళ లంచ్ బ్రేక్ తర్వాత ప్రారంభించిన రెండో సెషన్ లో వెంట వెంటనే రెండు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. లంచ్ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
ఇంగ్లాండ్ జట్టు 137 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది.ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పోక్స్ ఇచ్చిన క్యాచ్ ను భారత వికెట్ కీపర్ పట్టాడు. దీంతో ఫోక్స్ పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ కు ఫోక్స్ కు దక్కింది.
155 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెహాన్ వికెట్ దక్కింది. 48వ ఓవర్ లో బుమ్రా వేసిన బంతిని ఆడిన రెహాన్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెను దిరిగాడు.
దీంతో ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్ మెన్ భారత జట్టుపై ఒత్తిడి పెంచేందుకు బౌండరీలపై కేంద్రీకరించారు. అయితే 193 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజాకు హార్టీ చిక్కాడు. 54వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతికి హార్టీ బౌల్డయ్యాడు.
టీ బ్రేక్ తర్వాత బెన్ స్టోక్స్ దూకుడు పెంచాడు. ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు వేగం పెంచే ప్రయత్నం చేశాడు. తన సహచరులు పెవిలియన్ దారి పడుతున్నా బెన్‌స్టోక్స్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. అయితే 239 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు తొమ్మిదో వికెట్ చేజార్చుకుంది. 61వ ఓవర్ వేసిన ఆశ్విన్ మార్క్ వుడ్ ను బౌల్డ్ చేశాడు. ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులకు అలౌటైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూకుడుగా ఆడాడు. వన్ డే మ్యాచ్ లో ఆడినట్టుగా స్టోక్స్ బ్యాటింగ్ చేశాడు. 88 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్స్ లు, ఆరు ఫోర్లున్నాయి. భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ భరతం పట్టారు. ఆశ్విన్, జడేజాలకు చెరో మూడు వికెట్లు దక్కాయి. జస్ ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ కు రెండేసి చొప్పున వికెట్లు దక్కాయి.