Asianet News TeluguAsianet News Telugu

భారత్- బంగ్లాదేశ్ తొలి టెస్టు... టాస్ గెలిచిన బంగ్లా, జట్టులోకి ఇషాంత్ శర్మ

నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టతరంగా ఉంటుందనే ఉద్దేశంతో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నట్లు బంగ్లా సారథి మోమినుల్‌ హక్‌ తెలిపాడు. ఇక ఒకవేళ టాస్‌ గెలిస్తే  ఏ మాత్రం ఆలోచించకుండా తొలుత బౌలింగ్‌ ఎంచుకునేవాడినని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు.

India vs Bangladesh Live Score 1st Test Day 1: Bangladesh bat, Ishant Sharma returns for India
Author
Hyderabad, First Published Nov 14, 2019, 10:08 AM IST

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండోర్ లోని స్థానిక హోల్కర్ స్టేడియంలో టీమిండియా బంగ్లాదేశ్ గురువారం తలపడుతోంది. మొదటి టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టతరంగా ఉంటుందనే ఉద్దేశంతో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నట్లు బంగ్లా సారథి మోమినుల్‌ హక్‌ తెలిపాడు. ఇక ఒకవేళ టాస్‌ గెలిస్తే  ఏ మాత్రం ఆలోచించకుండా తొలుత బౌలింగ్‌ ఎంచుకునేవాడినని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. పిచ్‌ తొలి రోజు సీమర్లకు అనుకూలించే అవకాశం ఉందని, ఆ తర్వాత పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని కోహ్లి అభిప్రాయపడ్డాడు.

 దీంతో టాస్‌తోనే మ్యాచ్‌పై ఉత్కంఠ కలిగింది. ఇక ముందుగా ఊహించినట్టే రాంచీ టెస్టులో ఆడిన తుది జట్టు నుంచి ఒకే ఒక్క మార్పుతో భారత్‌ బరిలోకి దిగుతోంది. నాటి మ్యాచ్‌లో ఆడిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో ఇషాంత్‌ శర్మను జట్టులోకి తీసుకున్నారు. 

Alsoread రవిశాస్త్రిని మరోలా వాడుకుందాం... గంగూలీ కామెంట్స్...

ఇదిలా ఉండగా... ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది. ఆ సిరీస్ కి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోగా.. కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ చేపట్టాడు. ఇప్పుడు మళ్లీ కోహ్లీ బరిలోకి దిగాడు. 

టెస్టు జట్టులో పెద్దగా మార్పులు లేకపోయినా.. టీ20లో తొలిసారిగా ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేకు బెర్త్‌ దక్కింది. భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున అతడు అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అలాగే కేరళ యంగ్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ కల నాలుగేళ్ల తర్వాత నెరవేరింది. 2015లో జింబాబ్వేపై అతడు ఏకైక టీ20 మ్యాచ్‌ ఆడాడు. 

ఆ తర్వాత ఐపీఎల్‌లో, దేశవాళీల్లో చక్కటి ఆటతీరును కనబరుస్తున్నా జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. భారత్‌ ‘ఎ’ జట్టులో నిలకడగా రాణించే శాంసన్‌ ఇటీవలి విజయ్‌ హజారే ట్రోఫీలో ఏకంగా డబుల్‌ సెంచరీతో మెరవడంతో పాటు ఓవరాల్‌గా ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 125 స్ట్రయిక్‌ రేట్‌తో 410 పరుగులు సాధించాడు. దీంతో అతడికో అవకాశం కల్పించాలని సెలెక్షన్‌ కమిటీ భావించింది. 

AlsoRead అనుష్క స్ట్రాంగ్ కౌంటర్... క్షమాపణలు చెప్పిన ఫరూక్‌..

ఇక వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పేరు చర్చకు రాలేదు. అతడి స్థానంలో 26 ఏళ్ల శివమ్‌ దూబేకు చోటిచ్చారు. దీంతో విజయ్‌ శంకర్‌ స్థానం గల్లంతైంది. 

‘గతంలో హార్దిక్‌ ఉన్నప్పుడు రెండో ఆల్‌రౌండర్‌గా విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశాం. అయితే ఇప్పుడు ఆ స్థానంలో శివమ్‌ దూబే సరైన ఆటగాడని భావించాం. దూకుడుగా ఆడే దూబే భారత్‌ ‘ఎ’ తరఫున విండీస్‌ టూర్‌లో, దక్షిణాఫ్రికాపైనా సత్తా చాటాడు’ అని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే తెలిపాడు. ఇక ఆల్‌రౌండర్‌ జడేజాకు విశ్రాంతినివ్వగా స్పిన్నర్‌ చాహల్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో పేసర్‌ సైనీ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.టెస్టు మ్యాచ్  సమయానికి మళ్లీ కోహ్లీ జట్టుతో కలవనున్నాడు. 

టీ20 జట్టు
రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, సంజూ శాంసన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, క్రునాల్‌ పాండ్యా, చాహల్‌, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌.
 
టెస్టు జట్టు
కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, మయాంక్‌, పుజార, రహానె, విహారి, సాహా, జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, షమి, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌.

Follow Us:
Download App:
  • android
  • ios