IND vs AUS T20: ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న యశస్వి జైస్వాల్ 'సారీ' ఎందుకు చెప్పాడు..?

India Vs Australia T20 Series: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో యశస్వి జైస్వాల్ కేవలం 25 బంతుల్లోనే 53 పరుగులు చేసి తన దూకుడు ప్రదర్శించాడు. తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు భార‌త్ విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 
 

India Vs Australia T20 Series: Why Yashasvi Jaiswal said 'sorry' after winning the Player of the Match award RMA

Yashasvi Jaiswal: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో స‌త్తా చాటిన త‌ర్వాత భార‌త జ‌ట్టులో చోటు సంపాదించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఆటలో వేగంగా ప్రావీణ్యం సాధిస్తూ త‌న ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో ముందుకు సాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 21 పరుగులు చేసిన ఈ 21 ఏళ్ల క్రికెట‌ర్.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 25 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఈ ఎడమచేతి వాటం ఆటగాడు తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో భారత్ కు మంచి శుభారంభం లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (58)తో కలిసి తొలి వికెట్ కు 77 పరుగులు జోడించిన యశస్వి ఆరో ఓవర్ లో ఔటయ్యాడు.

భారత్ 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి ఆస్ట్రేలియాను 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే కట్టడి చేసి 44 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడిన య‌శ‌స్వి జైస్వాల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న యశస్వి రుతురాజ్ కు క్షమాపణలు చెప్పాడు. విశాఖపట్నంలో జరిగిన తొలి టీ20లో రుతురాజ్ తో కలిసి ఒపెనింగ్ కు దిగాడు. అయితే, ఒక పొర‌పాటు కార‌ణంగా రనౌట్ కు దారితీసింది.

ఇదే విష‌యం గురించి స్పందించిన జైస్వాల్.. "అది నా తప్పు. ఆయన దగ్గరకు వెళ్లి సారీ చెప్పాను. (మార్కస్) స్టోయినిస్ నా మధ్య ఉన్నాడు, నాకు ఖచ్చితంగా తెలుసు, కానీ ఆ సమ‌యంలో ఖచ్చితంగా తెలియదు. నేను తప్పుడు కాల్ చేశాను. గత మ్యాచ్ లో నేను చేసిన తప్పిదం ఇది. నేను నా తప్పును అంగీకరించాను. రుతు భాయ్ చాలా వినయంగా, ఎంతో శ్రద్ధగా ఉంటాడు' అని యశస్వి మ్యాచ్ అనంతరం తెలిపాడు. కాగా, ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ మంగళవారం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగే మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios