India vs Australia Champions Trophy: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలవాలని వారణాసిలో భారత క్రికెట్ అభిమానులు పూజలు చేశారు.

India vs Australia Champions Trophy: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు గెలవాలని వారణాసిలో భారత క్రికెట్ అభిమానులు పూజలు చేశారు. 2011 వరల్డ్ కప్ లో ఇండియా క్వార్టర్-ఫైనల్ గెలిచినప్పటి నుండి, ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో రెండు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. ఇండియా, ఆస్ట్రేలియా రెండూ చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. 

2019, 2023 వరల్డ్ కప్ లలో రౌండ్-రాబిన్ మ్యాచ్‌లలో ఇండియా గెలిచింది. మరోవైపు, 2015 సెమీ-ఫైనల్స్, 2023 ఫైనల్‌లో ఓడిపోయింది. నవంబర్ 19, 2023న చివరిసారిగా తలపడినప్పటి నుండి, దుబాయ్‌లో మంగళవారం జరిగే మ్యాచ్‌లో రెండు జట్లు పూర్తిగా వేరుగా ఉండబోతున్నాయి. భారత జట్టు సూపర్ ఫామ్ లో ఉంది. ఆసీస్ లో పలువురు కీలక ప్లేయర్లు దూరం అయ్యారు. అయితే, ఈ జట్టును తక్కువగా అంచనా వేయలేము. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో చాలా బలంగా కనిపిస్తోంది. భారత జట్టు గెలుపు కోసం వారణాశిలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Scroll to load tweet…

రెండు జట్ల మధ్య జరిగే ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు, క్రికెట్ అభిమానులు సారంగ్‌నాథ్ మహాదేవ్ కు మహా హారతి ఇచ్చారు. ఆలయ పూజారులు ఢమరుకం వాయిస్తూ టీమ్ ఇండియా గెలవాలని మహాదేవ్ మంత్రాలు చదివారు. ఈ ప్రత్యేక పూజలు పూర్తయిన తర్వాత, ఒక క్రికెట్ అభిమాని మాట్లాడుతూ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుకుంటుందని చెప్పాడు.

"ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా గెలవాలని సారంగ్‌నాథ్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశాం. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాకు చాలా ఆశలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కూడా పాకిస్తాన్‌పై ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను మళ్లీ ఆడాలి... ఇండియా ఖచ్చితంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంటుంది..." అని ఒక క్రికెట్ అభిమాని అన్నాడు.

Scroll to load tweet…

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత్ vs ఆస్ట్రేలియా జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.

IND vs AUS : భారత్ vs ఆస్ట్రేలియా.. ఛాంపియన్స్ ట్రోఫీ బిగ్ ఫైట్.. గెలిచేది ఇండియానే !