Asianet News TeluguAsianet News Telugu

IND vs AFG T20I Series: టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

IND vs AFG T20I Series: భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఏడాది విరామం తర్వాత టీమిండియా స్టార్ ప్లేయ‌ర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 జ‌ట్టులోకి వ‌చ్చారు.
 

India vs Afghanistan T20I Series: Virat Kohli returns, Rohit Sharma to captain BCCI Announce India Squad RMA
Author
First Published Jan 7, 2024, 7:45 PM IST

India vs Afghanistan T20I squad: దాదాపు ఏడాది త‌ర్వాత టీమిండియా స్టార్ ప్లేయ‌ర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు భార‌త టీ20 జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ఆదివారం (జనవరి 7) భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఏడాది విరామం తర్వాత వెటరన్ ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20ల్లో పునరాగమనం చేశారు. 2022 టీ20 వరల్డ్ క‌ప్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ, రోహిత్ ఆ తర్వాత టెస్టులు, వన్డేల్లో మాత్రమే పాల్గొన్నారు.

సీనియర్ బ్యాటింగ్ ద్వయం విరాట్, రోహిత్ లకు విశ్రాంతినివ్వడం వల్ల యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ వంటి వర్ధమాన ప్రతిభావంతులను భారత జట్టు సెలక్షన్ కమిటీ గుర్తించింది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) పునరుద్ధరించిన ఐఎస్ బింద్రా స్టేడియంలో జనవరి 11 (గురువారం) నుంచి మూడు మ్యాచ్ ల‌ భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. జూన్ లో యూఎస్ఏ, వెస్టిండీస్ ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ క‌ప్ కు ముందు భారత్ ఇదే చివరి టీ20 సిరీస్.

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లో భారత్ లీగ్ మ్యాచ్ లన్నీ యూఎస్ఏ లోనే ఎందుకు?

సిరాజ్-బుమ్రాల‌కు విశ్రాంతి

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కు భార‌త స్టార్ బౌల‌ర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ల‌కు సెల‌క్ష‌న్ క‌మిటీ విశ్రాంతినిచ్చింది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించిన భారత ప్రధాన పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు పనిభారం నిర్వహణను దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి ఇచ్చారు. 

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ దూరం

వ్యక్తిగత గాయం కారణంగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ సందర్భంగా గాయపడినప్పటి నుంచి హార్దిక్ భారత్ తరఫున ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక  సూర్యకుమార్ దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడ్డాడు. దీనికి తోడు రుతురాజ్ గైక్వాడ్ కూడా వేలి గాయం కారణంగా అందుబాటులో ఉండ‌టం లేదు.

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మ‌న్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.

T20 World Cup 2024: ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్.. ఐసీసీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios