ఓవల్ టెస్టులో భారత్ విజయంపై పాక్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ బంతి ట్యాంపరింగ్ ఆరోపణలు చేశారు. బంతికి వాసెలిన్ రాసి ఉండవచ్చని, అంపైర్లు బంతిని పరీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా సత్తా చాటుతుంది. అద్భుత పోరాటంతో ఓవల్ టెస్ట్‌లో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను సమం చేసింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ ఆరోపణలతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు లోనైంది. ఓవల్ టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చూపిన తర్వాత, బంతిని వాసెలిన్‌తో ట్యాంపరింగ్ చేశారని షబ్బీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓవల్ టెస్టులో టీమిండియా విజయం తరువాత పాక్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ Xఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ‘టీమ్‌ఇండియా బంతికి వాసెలిన్ రాసింది కావచ్చని నా అనుమానం. ఎందుకంటే 80 ఓవర్ల తర్వాత కూడా బంతి కొత్తదిలా మెరుస్తోంది. ఇది సాధారణం కాదు. అంపైర్లు ఆ బంతిని ల్యాబ్‌కి పంపించి పరీక్షించాలి.” అంటూ కక్షపూరితంగా పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియా యూజర్స్ అతడిపై పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ విజయాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని మండిపడుతున్నారు.
షబ్బీర్ అహ్మద్ ఎవరు?
షబ్బీర్ అహ్మద్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. అతడు 1999-2007 మధ్య పాకిస్తాన్ తరపున 10 టెస్టులు, 32 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. షబ్బీర్ అహ్మద్ 43 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 84 వికెట్లు పడగొట్టాడు. అయితే.. 2005లో అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా షబ్బీర్ అహ్మద్ ఒక ఏడాది పాటు నిషేధం విధించబడ్డాడు. ఈ నిషేధం డిసెంబర్ 2006లో ఎత్తివేయబడింది. తరువాత షబ్బీర్ ఐపీఎలో చెన్నై తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఫైనల్‌లో హ్యాట్రిక్ సాధించి చెన్నై ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు.
టీమిండియా అద్భుత విజయం
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 2025లో టీమిండియా ఓవల్ టెస్ట్ లో అద్భుత పోరాటంతో విజయం సాధించింది. కానీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ టీమిండియా బంతికి వాసెలిన్ రాసి ట్యాంపరింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకుండా, క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు షబ్బీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత బౌలర్ల అద్భుత పార్ట్నర్ షిప్. ముఖ్యంగా మోహమ్మద్ సిరాజ్ బౌలింగ్ కు క్రెడిట్ ఇవ్వకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అర్థంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
