జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు భార‌త్.. 5 టీ20ల సిరీస్ షెడ్యూల్ ఇదిగో..

India vs Zimabwe: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత ఐదు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. దీనికి సంబంధించి భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కి కృత‌జ్ఙ‌త‌లు తెలుపుతూ జింబాబ్వే క్రికెట్ బోర్డు షెడ్యూల్ వివ‌రాలు ప్ర‌క‌టించింది.
 

India to tour Zimbabwe after ICC T20 World Cup 2024. Here is the schedule of 5 T20Is series RMA

India vs Zimabwe T20Is schedule: టీమిండియా మ‌రోసారి ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా జింబాబ్వేలో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ జ‌ట్టు జింబాబ్వేతో5 టీ20 మ్యాచ్ ల‌ను ఆడ‌నుంది. జింబాబ్వే క్రికెట్ బోర్డు ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఏడాది జులైలో భారత పురుషుల సీనియర్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌ను ఉంటుంద‌నీ, వెస్టిండీస్-అమెరికాలలో జ‌ర‌గ‌బోయే ఐసీసీ టీ20 వ‌రల్డ్ క‌ప్ 2024 టోర్నీ ముగిసిన వారం త‌ర్వాత ఈ ద్వైపాక్షిక సిరీస్ ఉంటుంద‌ని తెలిపింది. భార‌త్-జింబాబ్వే మ‌ధ్య 2024 జూలై 6 నుంచి 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంద‌ని పేర్కొంది.

టీమిండియా గ‌తేడాది నవంబర్-డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో ఐదు టీ20లు, దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు ఆడింది. ఆ త‌ర్వాత స్వ‌దేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే, ఐసీసీ టీ20 వ‌రల్డ్ క‌ప్ 2024 మెగా టోర్నీకి ముందు భార‌త్ ఎలాంటి టీ20 మ్యాచ్ ల‌ను ఆడ‌టం లేదు. ప్ర‌పంచ క‌ప్ ముగిసిన త‌ర్వాత జింబాబ్వే తో టీ20 సిరీస్ అడ‌నుంది. జింబాబ్వే క్రికెట్ అభివృద్ధికి, శ్రేయస్సు కోసం బీసీసీఐ తన మద్దతును త‌ప్ప‌కుండా ఇస్తుంద‌ని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. గ్లోబల్ క్రికెట్ కమ్యూనిటీకి సహకారం అందించడంలో బీసీసీఐ ఎల్లప్పుడూ మార్గదర్శక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

U19 World Cup: ప్ర‌పంచ రికార్డు సృష్టించిన యంగ్ ఇండియా ప్లేయ‌ర్స్ ఉదయ్ సహారన్-సచిన్

భార‌త్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్: 

1వ T20I - 6 జూలై 2024, హరారే స్పోర్ట్స్ క్లబ్‌ 
2వ T20I - 7 జూలై 2024, హరారే స్పోర్ట్స్ క్లబ్‌
3వ T20I - 10 జూలై 2024, హరారే స్పోర్ట్స్ క్లబ్
4వ T20I - 13 జూలై 2024, హరారే స్పోర్ట్స్ క్లబ్‌
5వ T20I - 14 జూలై 2024, హరారే స్పోర్ట్స్ క్లబ్‌

కాగా, ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్ 2022 టోర్నీ సంద‌ర్భంగా చివ‌రిసారిగా టీ20 మ్యాచ్‌లో భారత్-జింబాబ్వేలు త‌ల‌ప‌డ్డాయి. టీమిండియా సునాయాస విజ‌యం సాధించింది. జూన్ 2016లో జరిగిన చివరి ద్వైపాక్షిక సిరీస్ లో ఆతిథ్య జింబాబ్వేపై భారత్ 2-1 విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 8 మ్యాచ్ ల‌ను ఆడిన భార‌త్ 6  విజయాలతో హెడ్-టు-హెడ్ రికార్డులో టాప్ లో ఉంది.

ANIL KUMBLE: 10 వికెట్లు తీసి పాకిస్తాన్ ను దెబ్బకొట్టిన భారత్ స్టార్ క్రికెటర్..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios