Asianet News TeluguAsianet News Telugu

Anil Kumble: 10 వికెట్లు తీసి పాకిస్తాన్ ను దెబ్బకొట్టిన భారత్ స్టార్ క్రికెటర్..

Anil Kumble: భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గ్రేట్ బౌలర్ అనిల్ కుంబ్లే సరిగ్గా 25 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ను ఒంటిచేత్తో ఆలౌట్ చేశాడు. ఏకంగా 10 వికెట్లు తీసి పాక్ ను చిత్తుగా ఓడించి భారత్ పరువు నిలిపాడు. టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే రెండో బౌలర్‌గా, ఆసియాలో మొదటి బౌలర్‌గా అనిల్ కుంబ్లే చ‌రిత్ర సృష్టించాడు.
 

India star cricketer Anil Kumble, who took 10 wickets to beat Pakistan, he became the first bowler of Asia RMA
Author
First Published Feb 7, 2024, 12:34 PM IST

India vs Pakistan - Anil Kumble : భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఇరు దేశాలు ఇచ్చే ప్రాధాన్యం మాములుగా ఉండ‌దు. ఇక క్రికెట్ ప్ర‌పంచంలో దాయాదుల పోరు అంటే ఆ క్రేజే వేరు. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో 10 వికెట్లు తీసుకుని ఒంటిచెత్తో భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు స్టార్ బౌల‌ర్ అనిల్ కుంబ్లే. 1999లో పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన పరువు కాపాడుకోవాలంటే రెండో టెస్టుతో గెలిచి సిరీస్ ను స‌మం చేయ‌డ‌మే ముందున్న స‌వాలు. ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. అయితే, ఈ మ్యాచ్ ఫిబ్రవరి 4న ప్రారంభమైన 4 రోజుల్లోనే ముగిసింది. భారత్ గెలిచింది.. ఈ మ్యాచ్ లో భార‌త స్టార్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఎవరూ ఊహించని విధంగా అద్భుత‌మైన బౌలింగ్ తో పాకిస్తాన్ 10 వికెట్లు తీసుకుని ఒంటిచేత్తో విజ‌యాన్ని అందించి చరిత్ర సృష్టించాడు.

స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్.. ఏం క్యాచ్ గురూ.. క‌ళ్లు చెదిరిపోయాతాయంతే.. ! వీడియో

ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు అలౌట్ అయింది. పాక్ జట్టు 172 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసి పాక్‌కు 420 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భార‌త్. పాకిస్థాన్ ఛేజింగ్ లో అద్భుత‌మైన ఆట‌ను కొన‌సాగించింది. తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ మ్య‌చ్ లో పాకిస్థాన్‌పై అనిల్ కుంబ్లే తొలి వికెట్ తీసుకున్నప్పుడు, తర్వాతి 9 వికెట్లు కూడా అనిల్ కుంబ్లేనే తీసుకుంటాడ‌ని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, అనిల్ కుంబ్లే అద్బుత‌మైన బౌలింగ్ తో 10 మంది పాక్ ఆట‌గాళ్ల‌ను వ‌రుస‌గా పెలిలియ‌న్ కు పంపాడు. తొలి వికెట్ కు 100 ప‌రుగులు దాటిన పాకిస్తాన్.. అనిల్ కుంబ్లే దెబ్బ‌కు మ‌రో 100 ప‌రుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఛేజింగ్ లో 207 పరుగులకే అనిల్ కుంబ్లే పాక్ ను కుప్ప‌కూల్చాడు. దీంతో టీమిండియా 212 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌కు చెందిన జిమ్ లేకర్ తర్వాత ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా  అనిల్ కుంబ్లే చ‌రిత్ర సృష్టించాడు. ఆసియాలో ఈ ఘ‌నత సాధించిన తొలి బౌల‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు.

 

U19 WORLD CUP: ప్ర‌పంచ రికార్డు సృష్టించిన యంగ్ ఇండియా ప్లేయ‌ర్స్ ఉదయ్ సహారన్-సచిన్ దాస్ 

Follow Us:
Download App:
  • android
  • ios