T20 World Cup 2024: భార‌త్-పాకిస్థాన్ మ్యాచ్.. క్రేజీ బ‌జ్..

T20 World Cup: India vs Pakistan: భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండ‌దు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తుంటారు క్రికెట్ అభిమానులు. ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో భార‌త్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి బిగ్ అప్డేట్ వ‌చ్చింది.   
 

India and Pakistan to be drawn in same group; Australia, England to be pitted together in T20 World Cup 2024 RMA

India vs Pakistan: ఐసీసీ క్రికెట్ టీ20 వ‌రల్డ్ క‌ప్ 2024 గురించి మ‌రో క్రేజీ అప్డేట్ వ‌చ్చింది. రాబోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను వెస్టిండీస్ తో పాటు యూఎస్ఏలో నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్ల‌ను ఐసీసీ ముమ్మ‌రంగా పూర్తి చేస్తోంది. అయితే, 2024 టీ20 వరల్డ్ క‌ప్ కు ముందు భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉంట‌య‌నే క్రేజీ బ‌జ్ చ‌క్క‌ర్లు కొడుతోంది. వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 9వ ఎడిషన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారంలోనే పూర్తి షెడ్యూల్ విడుద‌ల కానుంది. 

భారత్-పాక్ మ్యాచ్ అంటే మ‌స్తు క్రేజ్ ఉంట‌ది. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. మైదానంలో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. వచ్చే ఏడాది జరిగే టోర్నమెంట్ లో భార‌త్-పాకిస్థాన్ జ‌ట్లు ఒకే గ్రూప్ లో ఉండ‌నున్నాయ‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది క్రికెట్ ప్రియుల‌కు మ‌రింత విందైన పండుగ అని చెప్పాలి.  'ది టెలిగ్రాఫ్' పత్రిక నివేదిక‌ల ప్ర‌కారం.. న్యూయార్క్ లోని ఐసన్ హోవర్ పార్క్ లో భార‌త్-పాక్ మ‌ధ్య మ్యాచ్ జరగనుంది.

IND Vs SA: కీల‌క‌పోరు.. భారత్‌, దక్షిణాఫ్రికా మూడో వన్డే.. టీంలోకి కొత్త ప్లేయ‌ర్

అలాగే, యాషెస్ ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కూడా ఇదే గ్రూప్ లో తలపడనున్నాయ‌ని పేర్కొంది. ఈ మ్యాచ్ వెస్టిండీస్ లో జరగనుందని సమాచారం. జూన్ 4 నుంచి 30 వరకు జరిగే ఈ టోర్నీలో 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. వాటిలో 10 జట్లు తమ మ్యాచ్ ల‌ను యూఎస్ఏ లో ఆడతాయి. డల్లాస్ లోని గ్రాండ్ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్ లోని నస్సావు కౌంటీ ఈ పోటీలకు మూడు యూఎస్ ఏ వేదికలు ఖరారయ్యాయి. అయితే, ఇంగ్లాండ్ తన అన్ని మ్యాచ్ ల‌ను వెస్టిండీస్ లోనే ఆడనుంది.

2022 టీ20 వరల్డ్ క‌ప్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే వర్షం కురవడం, టాస్ కూడా జరగకపోవడంతో అభిమానులు హోరాహోరీ పోరును వీక్షించలేకపోయారు. టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడాయి. ఇంగ్లాండ్ 2 మ్యాచ్ ల్లో విజయం సాధించగా, ఆసీస్ 1 మ్యాచ్ లో విజయం సాధించింది. మరో మ్యాచ్ 2022లో రద్దయింది.

IND vs SA: సచిన్ టెండూల్కర్ భారీ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ మిస్సైన విరాట్ కోహ్లీ.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios