IND Vs SA: కీలకపోరు.. భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డే.. టీంలోకి కొత్త ప్లేయర్
India vs South Africa 3rd ODI: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే పార్ల్ లోని బోలాండ్ పార్క్ స్టేడియంలో జరగనుంది. దక్షిణాఫ్రికా టూర్ లో టీ20 సిరీస్ డ్రా గా ముగించిన భారత్.. వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
Ind vs Sa Live: దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా భారత్ జట్టు నేడు నిర్ణయాత్మకమైన మూడో వన్డేను ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను నిలబెట్టుకోవాలని భారత్ జట్టు చూస్తుండగా, స్వదేశంలో సిరీస్ ను కోల్పోకూడదని దక్షిణాఫ్రికా ప్లాన్ సిద్ధం చేస్తోంది. గురువారం పార్ల్ లోని బోలాండ్ పార్క్ స్టేడియంలో జరిగే మూడో వన్డే మ్యాచ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ జట్టు విజయం సాధించి మూడు మ్యాచ్ ల సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.
ఆతిథ్య జట్టు సౌతాఫ్రికా జట్టును 117 పరుగులకే కట్టడి చేసిన అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ వీరోచిత ప్రదర్శనతో రాహుల్ సేన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. అయితే రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ లో పెద్దగా రాణించకపోవడంతో 211 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికార 44 ఓవర్లలోనే 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వన్డే సిరీస్ నిర్ణయాత్మక పోరు నేడు జరగనుంది.
ఈ కీలక మ్యాచ్ కు ముందు జట్టులో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మల ఫామ్ ఆందోళనకరంగా మారడంతో మూడో వన్డే జట్టు కూర్పుపై భారత జట్టు మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన ప్రశ్నలు పుష్కలంగా ఉన్నాయి. సాయి సుదర్శన్ తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన రుతురాజ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో వరుసగా 5, 4 పరుగులతో నిరాశపరిచాడు. మరోవైపు రెండో వన్డేలో 10 పరుగుల వద్ద ఔటైన తిలక్ వర్మ బ్యాట్ తో ఇంకా ప్రభావం చూపలేకపోయాడు. 5వ స్థానంలో ఉన్న సంజూ శాంసన్‌ను జట్టులో కొనసాగించడంపై జట్టు మేనేజ్‌మెంట్‌కు మరో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఫస్ట్ వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా, రెండో వన్డేలో కేవలం 12 పరుగులతో నిరాశపరిచాడు. మూడో వన్డేలో రజత్ పాటిదార్ అరంగేట్రం చేసే అవకాశముంది.
ఇరు జట్ల అంచనాలు గమనిస్తే..
భారత్:
కేఎల్ రాహుల్ (కెప్టెన్,), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్.
దక్షిణాఫ్రికా:
ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, వియాన్ ముల్డర్, బ్యూరాన్ హెండ్రిక్స్. రాస్సీ వాన్ డెర్ డస్సేన్, తబ్రైజ్ షమ్సీ, లిజాద్ విలియమ్స్, కైల్ వెర్రెయిన్.
మ్యాచ్ టైం ఎంటి? ఎక్కడ చూడాలి?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3వ వన్డే పార్ల్‌లోని బోలాండ్ పార్క్ స్టేడియంలో జరుగుతుంది. ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. అలాగే, డిస్నీ + హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
సచిన్ టెండూల్కర్ 14 ఏండ్ల రికార్డును బద్దలు కొట్టిన బంగ్లా ప్లేయర్..
- Boland Park stadium Paarl
- Eurolux Boland Park stadium Paarl
- Ind vs Sa Live Score
- India vs South Africa 3rd ODI
- India vs South Africa ODI schedule
- India vs South Africa ODI series
- India vs south africa 3rd ODI
- Paarl
- Stadium in Paarl
- boland park
- cricket
- ind vs sa
- india vs south africa
- india vs south africa 3rd ODI
- india vs south africa live streaming
- india vs south africa odi 2023
- india vs south africa odi series 2023
- odi india vs south africa
- odi series
- pitch report in Eurolux Boland Park stadium Paarl
- playing 11
- south africa vs india 3rd odi
- south africa vs india odi 2023
- weather in Paarl