T20 World Cup 2024, IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్ జట్లు త‌ల‌ప‌డుతున్నాయి. అయితే, ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు త్వ‌ర‌గా ఔట్ అయి క‌ష్టాల్లోప‌డ్డ స‌మ‌యంలో త‌న‌కు ల‌భించిన లైప్ ల‌ను ఉప‌యోగించుకుని వ‌రుస బౌండ‌రీల‌తో అద‌ర‌గొట్టాడు రిష‌బ్ పంత్. 

T20 World Cup 2024, IND vs PAK : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో హై ఓల్టేజీ మ్యాచ్ భార‌త్-పాకిస్తాన్ లు న్యూయార్క్ లో త‌ల‌ప‌డుతున్నాయి. దాయాదుల పోరుకు ప‌లుమార్లు వ‌ర్షం అడ్డుప‌డింది. దీని కార‌ణంగా కొద్ది సేపు మ్యాచ్ ఆగింది. వ‌ర్షం త‌గ్గ‌డంతో మ‌ళ్లీ మ్యాచ్ మొద‌లైంది. అయితే, ఈ మ్యాచ్ లో ల‌క్కున్నోడు అంటే రిష‌బ్ పంత్ అనే చెప్పాలి. అత‌ను ఇచ్చిన ఐదు క్యాచ్ ల‌ను పాక్ ప్లేయ‌ర్లు అందుకోలేక‌పోయారు. బ్యాటింగ్ చేస్తూ రిష‌బ్ పంత్ ఒత్తిడిలో ఉన్న‌ట్టు కనిపించాడు. ఈ క్ర‌మంలోనే కొన్ని చెత్త షాట్లు ఆడాడు. కానీ, అదృష్టం కొద్ది పంత్ ఇచ్చిన క్యాచ్ ల‌ను పాక్ ప్లేయ‌ర్లు అందుకోలేక‌పోయారు.

ఎలాగోల ఒత్తిడి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రిష‌బ్ పంత్ వ‌రుస బౌండ‌రీల‌తో త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నాడు. పాక్ బౌల‌ర్ హ‌రీష్ రావుఫ్ వేసిన ఓవ‌ర్ లో వ‌రుస‌గా మూడు బౌండ‌రీలు బాదాడు. రిష‌బ్ పంత్ ఆడిన ఈ షాట్లు అద్భుతంగా ఉన్నాయి. త‌న‌దైన స్టైల్లో కొత్త షాట్ల‌ను ప‌రిచ‌యం చేశాడు. అయితే, 42 ప‌రుగుల వ‌ద్ద మ‌రోసారి లూజ్ షాట్ ఆడి బాబార్ ఆజంకు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. త‌న ఇన్నింగ్స్ లో 6 బౌండ‌రీలు బాదాడు. ఈ మ్యాచ్ లో రిష‌బ్ పంత్ టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.

Scroll to load tweet…

ఇదిలావుండ‌గా, భార‌త్ వ‌రుస వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 14 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 96 ప‌రుగుల‌తో ఆట‌ను కొన‌సాగిస్తోంది. రోహిత్ శ‌ర్మ 13, విరాట్ కోహ్లీ 4, అక్ష‌ర్ ప‌టేల్ 20, సూర్య కుమార్ యాద‌వ్ 7, శివ‌మ్ దూబే 3, ర‌వీంద్ర జ‌డేజా డ‌కౌట్ అయ్యాడు. 

Scroll to load tweet…

IND VS PAK : ఏంది మావా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు ఇలా ఔట్ అయ్యారు.. !