T20 World Cup 2024, IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే, తొలి ఓవర్ ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. మళ్లీ వర్షం తగ్గిన తర్వాత రెండో ఓవర్ లో తొలి బంతిని ఫోర్ తో స్టార్ట్ చేశాడు విరాట్ కోహ్లీ.
T20 World Cup 2024, IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2024 లో హై ఓల్టేజీ మ్యాచ్ భారత్-పాకిస్తాన్ లు న్యూయార్క్ లో తలపడుతున్నాయి. దాయాదుల పోరు కోసం యావత్ క్రికెట్ ప్రపంచ ఎదురుచూస్తుండగా, వర్షం దోబుచులాడుతూ అడ్డుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత్ బ్యాటింగ్ కు దిగింది. మరోసారి భారత జట్టు స్లార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రారంభించారు. ఇద్దరు మంచి టచ్ లో కనిపించారు.
రోహిత్ శర్మ తొలి బంతికే రెండు పరుగుల చేసి భారత స్కోర్ బోర్డును ప్రారంభించాడు. ఆ తర్వాత సిక్సుతో బాది మరింత ఊపుతో కనిపించాడు. తొలి ఓవర్ ముగిసిన తర్వాత మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ కొద్ది సేపు నిలిచిపోయింది. వర్షం ఆగడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభం అయింది. రెండో ఓవర్ ను విరాట్ కోహ్లీ ప్రారంభించాడు. తన తొలి బంతికే ఫోర్ కొట్టి తన దూకుడును ప్రదర్శించాడు. అయితే, మరోసారి మరో షాట్ ఆడబోయే క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. నషీమ్ షా బౌలింగ్ తో భారీ షాట్ కొట్టబోయిన విరాట్ కోహ్లీకి కనెక్షన్ కుదరకపోవడంతో ఉస్మాన్ ఖాన్ కు దొరికిపోయాడు. 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
అయితే, మరో ఎండ్ లో రోహిత్ శర్మ మంచి షాట్స్ ఆడుతూ దూకుడు ప్రదర్శించాడు. అయితే, మరోసారి భారీ సిక్సర్ కొట్టబోయాడు... అయితే, బౌండరీలైన్ వద్ద క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో 13 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో భారత్ మూడో ఓవర్ లోనే 19 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడిలోకి జారుకుంది.
IND VS PAK : భారత్-పాకిస్తాన్.. మనల్ని ఆపేది ఎవడ్రా.. ! కాచుకోండి ఇక..
