IND vs PAK : భారత్-పాకిస్తాన్.. మనల్ని ఆపేది ఎవడ్రా.. ! కాచుకోండి ఇక..
T20 World Cup 2024, IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే తమ మొదటి మ్యాచ్ ను ఆడేశాయి. భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను చిత్తుచేసింది. మరోవైపు పాకిస్తాన్ జట్టు ఎవరూ ఊహించని విధంగా అమెరికా చేతిలో చిత్తుగా ఓడింది. భారత్-పాక్ గత రికార్డులు గమనిస్తే..
T20 World Cup 2024, IND vs PAK : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆరంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం నుంచి ఈ దాయాదుల పోరు కోసం యావత్ క్రికెట్ ప్రపంచ ఎదురుచూస్తోంది. అయితే, గత ఐదు భారత్-పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ పోటీలను తిరిగి చూస్తే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో ఇరు జట్ల మధ్య పోరు అసలు సిసలైన మజాను అందించాయి. చివరి బంతివరకు సాగిన మ్యాచ్ లను చాలానే ఉన్నాయి. ఏదేమైన టీ20 ప్రపంచ కప్ లో దాయాదుల పోరులో భారత్ దే పైచేయిగా ఉంది. భారత్-పాకస్తాన్ ఆడిన గత రికార్డులను గమనిస్తే..
2022 : విరాట్ కోహ్లీ సూపర్ షో
పాకిస్థాన్ 159/8 (షాన్ మసూద్ 52, హార్దిక్ పాండ్యా 3/30)
భారత్ 160/6 (విరాట్ కోహ్లీ 82 , హరీస్ రౌఫ్ 2/36*)
భారతదేశం-పాకిస్తాన్ ఇటీవల చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాలోని ఐకానిక్ ఎంసీజీ స్టేడియంలో తలపడ్డాయి. షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్‌ల అర్ధ సెంచరీలు పాకిస్తాన్‌కు సాధారణ ఆరంభాన్ని అందించాయి. దీంతో భారత్ ముందు 160 పరుగులు టార్గెట్ ను ఉంచింది. అయితే, భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా మద్దతుతో భారత్ కు విజయాన్ని అందించాడు. కోహ్లి 82* పరుగుల (ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
2021 : భారత్ పై పాకిస్థాన్ పైచేయి..
భారత్ 151/7 (విరాట్ కోహ్లి 57, షాహీన్ అఫ్రిది 3/31)
పాకిస్థాన్ 152/0 (మహ్మద్ రిజ్వాన్ 79, బాబర్ ఆజం 68)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మినహాయించి, 2021కి ముందు సీనియర్ పురుషుల ఐసీసీ ట్రోఫీ పోటీలో పాకిస్తాన్ తో భారత్ ఎన్నడూ ఓడిపోలేదు. దుబాయ్‌లో షాహీన్ అఫ్రిది అద్భుతమైన స్పెల్‌లో భారతదేశం టాప్-ఆర్డర్ కుప్పకూలింది. మధ్యలో కోహ్లి, రిషబ్ పంత్ నిలదొక్కుకున్నప్పటికీ భారత్ 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఇన్నింగ్స్ తో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలిచింది.
2016 : ధోనీ సారథ్యంలో కింగ్ కోహ్లీ మ్యాజిక్..
పాకిస్థాన్ 118/5 (షోయబ్ మాలిక్ 26, సురేశ్ రైనా 1/4)
భారత్ 119/4 (విరాట్ కోహ్లీ 55 , మహ్మద్ సమీ 2/17*)
ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, షాహిద్ అఫ్రిది, ఆశిష్ నెహ్రా, మహ్మద్ షమీ, సురేశ్ రైనా, కోహ్లీ వంటి స్టార్లతో కూడిన భారత జట్టు పాకిస్తాన్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో కోహ్లి అద్భుతమైన హాఫ్ సెంచరీతో మరోసారి పాక్ ను చిత్తుచేసింది.
2014: ఢాకా కూడా భారత్ దే..
పాకిస్థాన్ 130/7 (ఉమర్ అక్మల్ 33, అమిత్ మిశ్రా 2/22)
భారత్ 131/3 (విరాట్ కోహ్లీ 36 , బిలావల్ భట్టి 1/17*)
ఢాకా పిచ్ స్లోగా ఉంది. పాకిస్థాన్ పై భారత స్పిన్నర్లు అద్భుతమైన స్పెల్ తో ఆ జట్టు కష్టాలు మరింతగా పెరిగాయి. రవి చంద్రన్ అశ్విన్ (నాలుగు ఓవర్లలో 0/23), రవీంద్ర జడేజా (1/18), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అమిత్ మిశ్రా (2/22 4) ఓవర్‌కి ఆరు పరుగులివ్వడంతో పాకిస్థాన్ స్కోరు 130కి చేరుకుంది. ఛేదనలో కింగ్ కోహ్లీ (36*), సురేష్ రైనా (35)లు రాణించడం, రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ నుండి మంచి ఆరంభం రావడంతో భారత్ మరో విజయాన్ని అందుకుంది.
2012: కొలంబోలో కోహ్లీ ధనాధన్ ఇన్నింగ్స్
పాకిస్థాన్ 128 (షోయబ్ మాలిక్ 22, లక్ష్మీపతి బాలాజీ 3/22)
భారత్ 129/2 (విరాట్ కోహ్లీ 78 , రజా హసన్ 1/22*)
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2012లో అద్భుతమైన ఫామ్ తో సూపర్ ఇన్నింగ్స్ లు ఆడాడు. ప్రారంభంలో అతని అత్యుత్తమ వన్డే నాక్‌లలో రెండు (శ్రీలంకపై 133*, పాకిస్తాన్‌పై 183) చేశాడు. అతని మ్యాజిక్ టచ్ టీ20 ప్రపంచ కప్ పాక్ మ్యాచ్ లో కూడా కనిపించింది. అశ్విన్, యువరాజ్ సింగ్ కేవలం 32 పరుగులకే నాలుగు వికెట్లు తీశారు. భారత స్పిన్నర్లు ఆరంభంలోనే మ్యాచ్ ను తమ చేతుల్లోక తీసుకున్నారు. ఓపెనర్ మహ్మద్ హఫీజ్‌ను ఔట్ చేసిన కోహ్లి కూడా ఒక వికెట్ అందించాడు. భారత బౌలింగ్ దెబ్బకు పాక్ 128 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో భారత్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ డకౌట్ అయినప్పటికీ.. కింగ్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 17 ఓవర్లలోనే భారత్ కు విజయాన్ని అందించారు. తన 78 పరుగుల ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో దుమ్మురేపాడు.
IND VS PAK : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ను వర్షం దెబ్బకొట్టనుందా?
- Babar Azam
- Cricket
- Hardik Pandya
- IND
- IND vs PAK
- India
- India vs Pakistan
- India vs Pakistan cricket match
- Indian national cricket team
- PAK
- Pakistan
- Rain on India Pakistan match
- Rohit Sharma
- T20 WC
- T20 World Cup
- T20 World Cup 2024
- Team India
- These are India's records against Pakistan in T20 World Cup
- USA
- West Indies
- World Cup
- heavy rain
- rain in New York