Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: ఇది ఇండియన్ బాల్ గురూ.. ఒకవైపు జైస్వాల్.. మరోవైపు పుజారా.. సెంచరీల మోత !

India vs England : ఇంగ్లాండ్ బాజ్ బాల్ తో భ‌య‌పెడ‌తానంది కానీ, ఇండియ‌న్ బ్యాట్ రుచిచూపించారు భార‌త బ్యాట‌ర్స్. రాజ్ కోట్ లో ఒకే రోజు యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్, సినియ‌ర్ ప్లేయ‌ర్ ఛ‌తేశ్వ‌ర్ పుజారాలు సెంచ‌రీల మోత మోగించారు. 
 

IND vs ENG: This is the Indian Ball.. Yashasvi Jaiswal, Cheteshwar Pujara score centuries on the same day in Rajkot RMA
Author
First Published Feb 18, 2024, 9:39 AM IST | Last Updated Feb 18, 2024, 9:39 AM IST

India vs England : భార‌త క్రికెట‌ర్స్ సెంచ‌రీల మోత మోగిస్తున్నారు. రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెర్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ కొట్టాడు. ఆ త‌ర్వాత ర‌వీంద్ర జ‌డేజా సెంచ‌రీతో సాధించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బెన్ డ‌కెట్ సైతం భార‌త్ పై సెంచ‌రీ కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ సెంచ‌రీ సాధించాడు. రాజ్ కోట్ లోనే టీమిండియా సీనియ‌ర్ ప్లేయ‌ర్ ఛ‌తేశ్వ‌ర్ పుజారా సైతం సెంచ‌రీతో చెల‌రేగ‌డం విశేషం.

రాజ్ కోట్ సెంచ‌రీల మోత‌.. ! 

రంజీ ట్రోఫీ 2024లో సౌరాష్ట్ర జట్టుకు ఆడుతున్నప్పుడు భారత జట్టు అనుభవజ్ఞుడైన సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ ఛ‌తేశ్వర్ పుజారా తుఫాను సెంచరీ సాధించాడు. ఫిబ్రవరి 17న రాజ్‌కోట్‌లో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మణిపూర్‌పై ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 63వ సెంచరీ సాధించాడు. సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే, రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు భారత జ‌ట్టు అద్భుత‌మైన ఆట‌తో ఇంగ్లాండ్ ను దెబ్బ‌కొట్టింది. ఈ త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ బ్యాట్‌తో అద్భుతాలు చేసి, తుఫాను సెంచరీని సాధించాడు. రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సనోసర క్రికెట్ గ్రౌండ్‌లో కూడా ఛ‌తేశ్వ‌ర్ పుజారా తన అద్భుతమైన ప్రదర్శనతో సెంచ‌రీ కొట్టాడు.

IND VS ENG : భార‌త ఆట‌గాళ్లు రాజ్‌కోట్ లో చేతికి న‌ల్ల బ్యాడ్జీలతో ఎందుకు మ్యాచ్ ఆడారు ?

ఇంగ్లాండ్ బాజ్ బాల్ కాదు.. ఇండియన్ బ్యాట్ బాల్.. !

ఛ‌తేశ్వర్ పుజారా 'బేస్ బాల్' తరహాలో తుఫాను సెంచరీ సాధించాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది 63వ సెంచరీ. పుజారా తన ఇన్నింగ్స్ తో మ‌రోసారి విమర్శకుల నోళ్లు మూయించాడు. పుజారా ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు.  ఈ రంజీ సీజ‌న్ లో పుజారాకు ఇది మూడో సెంచరీ. ఇదివ‌ర‌కు జార్ఖండ్‌పై డబుల్ సెంచరీ చేశాడు. రాజస్థాన్‌పై 110 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

ఇంగ్లాండ్ పై రాజ్ కోట్ టెస్టులో ఇప్పటికే మూడు సెంచరీలు ! 

రాజ్ కోట్ లో జ‌రుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ పై భార‌త బ్యాట‌ర్స్ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ కొట్టాడు. 131 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు,  3 సిక్స‌ర్లు బాదాడు. ఆ త‌ర్వాత భార‌త్ స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా సైతం సెంచ‌రీ కొట్టాడు. 112 ప‌రుగుల జ‌డేజా త‌న ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ తుఫాన్ ఇన్నింగ్స్ తో సెంచ‌రీ కొట్టాడు. 104 ప‌రుగులు చేసిన త‌ర్వాత రిటైర్డ్ హర్ట్ వెనుదిరిగాడు. త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో జైస్వాల్ 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాదాడు. ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్ లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేసి అద‌ర‌గొట్టాడు. అయితే, దుర‌దృష్ట‌వ‌శాత్తు 62 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ అయ్యాడు. మ‌రో ప్లేయ‌ర్ ధృవ్ జురెల్ 46 ప‌రుగులు కొట్టాడు.

ఒక్కడు, పోకిరి, దూకుడు ఇవేమీ కాదు..కృష్ణకి అత్యంత ఇష్టమైన మహేష్ మూవీ అదే, ఎందుకో తెలుసా

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios