Rahul Dravid: "పిచ్ ఎలా ఉన్నా.. అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించడమే తెలుసు.."
Rahul Dravid: ఇంగ్లండ్‌తో విశాఖపట్నంలో జరిగిన 2వ టెస్టులో విజయం సాధించిన అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ పిచ్ ఏదైనా సరే.. అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించడమే మాకు తెలుసునని రాహుల్ ద్రావిడ్ అన్నారు
Rahul Dravid: విశాఖపట్నం వేదికగా భారత్- టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే రెండో టెస్టు మ్యాచ్‌ను గెలిచిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఈ నేపథ్యంలో మరోసారి పిచ్ ల అంశం చర్చకు వచ్చింది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ విజయం తర్వాత పిచ్‌పై ఫిర్యాదు చేసిన వారికి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తగిన సమాధానం ఇచ్చాడు. స్వదేశంలో ఆడుతున్నప్పుడు స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్‌లనుుతయారు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ డిమాండ్ చేయదని, ఐదు రోజుల టెస్టులో పిచ్ ఎలాంటి బౌలింగ్ కు అనుకూలిస్తోందో ? అంచనా వేయడం కష్టమని భారత్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.
రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన తరువాత ..రాబోయే మూడు మ్యాచ్‌ల పిచ్ లు.. విశాఖపట్నంలా ఉంటుందా అని ద్రవిడ్‌ను ప్రశ్నించగా, ఇతరుల మాదిరిగానే తనకు కూడా ఈ విషయంపై సమాచారం లేదని చెప్పాడు. రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, "క్యూరేటర్లు పిచ్‌ను సిద్ధం చేస్తారు. మేము ఎప్పుడూ ర్యాంక్ టర్నర్ (స్పిన్నర్‌లకు సహాయపడే పిచ్) పిచ్ లు కావాలని అడగం అడగము. సహజంగానే, భారతదేశంలోని పిచ్‌లపై బంతి తిరుగుతుంది. స్పిన్ కు అనుకూలిస్తుంటాయి. కానీ, ఏ పిచ్ లో బంతి ఎంత తిరుగుతుందో మాకు తెలియదు. నేను నిపుణుడిని కాదు. భారతదేశంలోని పిచ్ నాలుగు లేదా ఐదు రోజులలో స్పిన్నర్లకు సహాయపడుతుంది." అని అన్నారు.
భారత కోచ్ ఇంకా మాట్లాడుతూ, "కొన్నిసార్లు నాకు మూడవ రోజు నుండి స్పిన్ కు అనుకూలిస్తుంది. కొన్ని సార్లు అది పిచ్ మొదటి రోజు నుండి స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది. కొన్నిసార్లు... ఈ పిచ్ పై రెండో రోజు నుంచి స్పిన్ తిరుగుతోంది. కొన్ని చోట్ల నాలుగో రోజు కూడా బంతి తిరగకపోవడం నేను గమనించాను. మనదేశంలోని పిచ్ లు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో, అందరిలాగే నాక్కూడా అర్థం కాదు. పిచ్ ఎలాంటిదైనా సరే అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించడమే మాకు తెలుసు" అని అన్నారు.
రాజ్‌కోట్ టెస్టుకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటంపై ప్రశ్నించినప్పుడు, రాహుల్ ద్రవిడ్ ఆ ప్రశ్నను సెలెక్టర్లకు వదిలేశాడు. తదుపరి మూడు మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేసే సమయంలో సెలక్టర్లు దీనికి అత్యుత్తమ సమాధానం ఇవ్వగలరు' అని అన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన విషయం తెలిసిందే.