Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: రాజ్‌కోట్ టెస్టులో నమోదైన టాప్-10 ప్ర‌పంచ రికార్డులు !

India vs England : ఇంగ్లాండ్‌పై య‌శ‌స్వి జైస్వాల్ స‌హా ముగ్గురు భారత ఆటగాళ్లు వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు సాధించారు. 1993లో ఇంగ్లాండ్ పై వరుస టెస్టుల్లో కాంబ్లీ, 2017లో శ్రీలంకపై విరాట్ కోహ్లీ వ‌రుస టెస్టుల్లో రెండు డ‌బుల్ సెంచ‌రీలు సాధించారు. 
 

IND vs ENG: Here are the top-10 world records recorded in the Rajkot Test RMA
Author
First Published Feb 18, 2024, 10:16 PM IST | Last Updated Feb 18, 2024, 10:16 PM IST

India vs England : రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా చ‌రిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ పై భారీ ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన భార‌త్..  పూర్తిగా ఇంగ్లాండ్ పై అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. అయితే, రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్ అనేక ప్ర‌పంచ రికార్డుల‌కు సాక్షిగా నిలిచింది. ఈ మ్యాచ్ లో న‌మోదైన టాప్-10 క్రికెట్ రికార్డులు గ‌మ‌నిస్తే.. 

1) రాజ్‌కోట్‌లో టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ చేసిన అజేయమైన డ‌బుల్ సెంచ‌రీ కొట్టాడు. అత‌ని 214 పరుగుల ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వసీం అక్రమ్ రికార్డును జైస్వాల్ సమం చేశాడు. జైస్వాల్ తన తొలి మూడు టెస్టు సెంచరీలను 150 ప్లస్ స్కోర్లు (171, 209, 214)గా మార్చిన మొదటి భార‌త క్రికెట‌ర్ గా కూడా చ‌రిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఈ రికార్డు సాధించిన ఏడవ ఆటగాడు అయ్యాడు. 

2) రాజ్‌కోట్ టెస్టు లో జైస్వాల్ (22 ఏళ్ల 49 రోజులు) టెస్టు క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 

3) య‌శ‌స్వి జైస్వాల్ తో పాటు వరుస టెస్టుల్లో ముగ్గురు భారత ఆటగాళ్లు డబుల్ సెంచరీలు సాధించారు. వారిలో వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీలు ఉన్నారు. 

4) రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ పై భారత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య 28. ఇది ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును సృష్టించిన రెండో మ్యాచ్ గా నిలిచింది.

5) రాజ్ కోట్ టెస్టులో కొట్టిన‌ 28 సిక్సర్లలో పద్దెనిమిది రెండో ఇన్నింగ్స్‌లో వచ్చాయి. 2014 షార్జా టెస్ట్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ 22 పరుగుల తర్వాత ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో రెండవ అత్యధిక సిక్సర్లు.

IND VS ENG: కోహ్లీ, ధోని, గంగూలీల రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

6) ఇంగ్లాండ్ తో జరిగిన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భార‌త ప్లేయ‌ర్లు 48 సిక్సర్లు కొట్టారు. ఒక సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భార‌త్ నిలిచింది. 

7) రాజ్‌కోట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌తో రెండు ఇన్నింగ్స్ ల‌లో ధ‌నాధ‌న్ గేమ్ తో హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. అరంగేట్రంలో స్ట్రైక్ రేట్ (94.2), టెస్టులో రెండు ఫిఫ్టీ-ప్లస్ స్కోర్‌లతో దిగ్గ‌జ ప్లేయ‌ర్లు ఉన్న ఎలైట్ గ్రూప్ లో చేరాడు.

8) 2009 అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఒక జట్టు రెండు ఇన్నింగ్స్‌లలో 400 ప్లస్ స్కోర్ చేసింది. ఓవరాల్‌గా, ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక జట్టు 400కి పైగా పరుగులు చేయడం ఇది పదకొండవసారి.

9) జైస్వాల్-సర్ఫరాజ్ మధ్య భాగస్వామ్య సమయంలో 6.53 రన్ రేట్ న‌మోదైంది. టెస్టుల్లో 150-ప్లస్ బంతుల్లో ఈ రన్ రేట్‌ను సాధించిన ఏడో భాగస్వామ్యంగా ఈ జోడీ నిలిచింది. 

10) రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ ముందు భార‌త్ ఉంచిన టార్గెట్ 557 పరుగులు. ఇది టెస్ట్ క్రికెట్‌లో వారి రెండవ అత్యధికం. 2009 వెల్లింగ్‌టన్ టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై 617 పరుగుల టార్గెట్ టాప్ లో ఉంది.

India vs England : టీమిండియా గెలుపులో ఆరుగురు హీరోలు.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios