Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG 1st Test: ఉప్పల్ స్టేడియంలో రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని, వీడియో వైరల్

భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య  హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో  తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.

IND vs ENG, 1st Test: Video of fan breaching security to touch Rohit Sharma's feet goes viral (WATCH) lns
Author
First Published Jan 25, 2024, 4:52 PM IST | Last Updated Jan 25, 2024, 4:52 PM IST

హైదరాబాద్:భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య గురువారం నాడు హైద్రాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకడానికి ఓ అభిమాని భద్రతా వలయాన్ని చేధించుకొని వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించే సమయంలో రోహిత్ శర్మ వద్దకు పరుగెత్తుకు వచ్చాడు అభిమాని.

 

రోహిత్ శర్మ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించాడు. అయితే రోహిత్ శర్మ అతడిని వారించాడు. మైదానంలోకి వచ్చిన అభిమానిని పోలీసులు తీసుకెళ్లారు. విరాట్ కోహ్లి పేరుతో ఉన్న జెర్సీని ధరించి అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ వద్దకు అభిమాని రావడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. రోహిత్ శర్మ వద్దకు అభిమాని వెళ్లడంపై విధుల్లో ఉన్న సిబ్బందిని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆరా తీశారు. క్రికెట్ లో భారత జట్టు తొలి రోజు ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులకు అలౌటైంది. రవీంద్ర జడేజా, రవిచంద్ర ఆశ్విన్ లు చెరో మూడు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, బుమ్రాలు రెండేసి వికెట్లు తీశారు. జస్ ప్రీత్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులకు అలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. విరాట్ కోహ్లి జెర్సీని ధరించిన అభిమాని సెక్యూరిటీ ప్రొటోకాల్ ను ఉల్లంఘించి రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి అతని పాదాలను తాకడం ద్వారా తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే  రోహిత్ శర్మ వద్దకు అభిమాని రావడంపై  పోలీసులు సీరియస్ అయ్యారు.  రోహిత్ శర్మ వద్దకు అభిమాని వెళ్లడంపై  విధుల్లో ఉన్న సిబ్బందిని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆరా తీశారు.

 

క్రికెట్ లో భారత జట్టు తొలి రోజు ఇంగ్లాండ్  జట్టు 246 పరుగులకు అలౌటైంది.రవీంద్ర జడేజా, రవిచంద్ర ఆశ్విన్ లు చెరో మూడు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, బుమ్రాలు రెండేసి వికెట్లు తీశారు.జస్ ప్రీత్ బౌలింగ్ లో  ఇంగ్లాండ్ కెప్టెన్  బెన్ స్టోక్స్  ఔట్ కావడంతో  ఇంగ్లాండ్ జట్టు  246 పరుగులకు అలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. విరాట్ కోహ్లి జెర్సీని ధరించిన అభిమాని  సెక్యూరిటీ ప్రొటోకాల్ ను ఉల్లంఘించి  రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి అతని పాదాలను తాకడం ద్వారా తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios