MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • Mitchell Starc: టెస్టుల్లో మిచెల్ స్టార్క్ ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్

Mitchell Starc: టెస్టుల్లో మిచెల్ స్టార్క్ ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్

Mitchell Starc: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 434వ వికెట్ తీసి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 13 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నయా చరిత్ర సృష్టించిన స్టార్క్
Image Credit : Getty

నయా చరిత్ర సృష్టించిన స్టార్క్

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్‌లో సంచలన రికార్డు నమోదు చేశాడు. డార్విన్ లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్ వికెట్ తీయడం ద్వారా స్టార్క్ ఈ ఘనత సాధించాడు. తొమ్మిదో ఓవర్లో బౌలర్ నాథన్ క్యాచ్ తో ఈ వికెట్ పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హేరాత్, కపిల్ దేవ్ రికార్డులు సమం
Image Credit : Getty

హేరాత్, కపిల్ దేవ్ రికార్డులు సమం

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మిచెల్ స్టార్క్ ఖాతాలో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ రంగన హేరాత్ పేరిట ఉన్న 433 వికెట్ల రికార్డు సమంగా ఉండేది. కానీ షాద్మాన్ ఇస్లామ్‌ను అవుట్ చేయడంతో తన వికెట్ల సంఖ్యను 434కి పెంచుకున్నాడు. దీంతో హేరాత్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. స్టార్క్ ఇప్పటివరకు 106 టెస్టుల్లో 434 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును కూడా స్టార్క్ సమం చేశాడు. కపిల్ దేవ్ 1978 నుండి 1994 మధ్య 131 మ్యాచ్‌ల్లో 434 వికెట్లు తీయగా, స్టార్క్ ఆయన కంటే 25 మ్యాచ్‌లు తక్కువగా ఆడి అదే వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం.

Related Articles

Related image1
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Related image2
Abhishek Porel: ఐపీఎల్ యంగ్ స్టార్ అరెస్ట్.. సంచలనం రేపుతున్న కేసు వివరాలు.. అసలు ఏం జరిగింది?
35
టాప్ 10 జాబితాకు అత్యంత సమీపంలో
Image Credit : Getty

టాప్ 10 జాబితాకు అత్యంత సమీపంలో

36 ఏళ్ల ఈ ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టర్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైమ్ టాప్ 10 అత్యధిక వికెట్ల వీరుల జాబితాలోకి ప్రవేశించడానికి కేవలం ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం 10వ స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ ఉన్నాడు. స్టెయిన్ 93 టెస్టుల్లో 439 వికెట్లు పడగొట్టాడు. మరొక ఆరు వికెట్లు తీస్తే స్టార్క్, స్టెయిన్ రికార్డును దాటి టాప్ 10 లోకి ప్రవేశిస్తాడు.

కాగా, క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్టార్క్ అక్టోబర్ 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. క్రికెట్‌లోని మూడు ఐసీసీ ప్రధాన ట్రోఫీలు (వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) గెలుచుకున్న అరుదైన రికార్డు కూడా ఇతని సొంతం.

45
టెస్టుల్లో టాప్ 10 లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు
Image Credit : Getty

టెస్టుల్లో టాప్ 10 లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు

1. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) - 106* మ్యాచ్‌లు, 434 వికెట్లు

2. రంగన హేరాత్ (శ్రీలంక) - 93 మ్యాచ్‌లు, 433 వికెట్లు

3. వసీం అక్రమ్ (పాకిస్తాన్) - 104 మ్యాచ్‌లు, 414 వికెట్లు

4. డేనియల్ వెటోరీ (న్యూజిలాండ్) - 113 మ్యాచ్‌లు, 362 వికెట్లు

5. చమింద వాస్ (శ్రీలంక) - 111 మ్యాచ్‌లు, 355 వికెట్లు

6. రవీంద్ర జడేజా (భారత్) - 89 మ్యాచ్‌లు, 348 వికెట్లు

7. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) - 78 మ్యాచ్‌లు, 317 వికెట్లు

8. మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) - 73 మ్యాచ్‌లు, 313 వికెట్లు

9. జహీర్ ఖాన్ (భారత్) - 92 మ్యాచ్‌లు, 311 వికెట్లు

10. డెరెక్ అండర్‌వుడ్ (ఇంగ్లాండ్) - 86 మ్యాచ్‌లు, 297 వికెట్లు

55
198 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా
Image Credit : X/ICC

198 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా

మరోవైపు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టును బంగ్లాదేశ్ పేసర్లు దెబ్బతీశారు. బంగ్లాదేశ్ యంగ్ బౌలర్ హసన్ మహ్మద్ సూపర్ బౌలింగ్‌తో విరుచుకుపడి 55 పరుగులకు 6 వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో ఆస్ట్రేలియాకిది అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఆస్ట్రేలియా బ్యాటర్లలో సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 71 పరుగులు సాధించాడు. టాస్క్ అహ్మద్ 2, ఎబాదత్ హొస్సేన్ 2 వికెట్లతో రాణించారు. సుదీర్ఘమైన 23 ఏళ్ల నిరీక్షణ తర్వాత బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై మళ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటం విశేషం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Related Stories
Recommended image1
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Recommended image2
Abhishek Porel: ఐపీఎల్ యంగ్ స్టార్ అరెస్ట్.. సంచలనం రేపుతున్న కేసు వివరాలు.. అసలు ఏం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved