IND vs AFG: మొహాలీలో బ్యాటర్స్ విధ్వంసం సృష్టిస్తారా లేదా బౌలర్లు శాసిస్తారా? పిచ్ రిపోర్ట్..
India Afghanistan T20 Series: భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ లో బ్యాటర్స్ అదరగొడుతారా? లేదా బౌలర్స్ శాసిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడి వాతావరణం మ్యాచ్ ను ఎవరివైపుకైనా తిప్పవచ్చు.
IND vs AFG 1st T20I: మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ పై అక్కడి వాతావరణం ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మైదానంలో బ్యాట్స్ మెన్ పైచేయి కనిపిస్తుంటుంది. పిచ్ లో మంచి బౌన్స్ ఉండటం వల్ల బంతి బ్యాట్ పై బాగా వస్తుంది. అలాగే, గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ కూడా చాలా వేగంగా ఉంటుంది, దీని వల్ల బౌండరీ లైన్ దాటి బంతిని చేరుకోవడం మరింత సులభం అవుతుంది. అయితే, ప్రస్తుతం తీవ్రమైన చలి, మంచుతో కూడిన వాతారణ పరిస్థితులు మ్యాచ్ పై ప్రభావం చూపడంతో బ్యాటర్స్ కు అనుకూలంగా ఉండే పిచ్ బౌలర్స్ కు కూడా అనుకూలించే విధంగా మారవచ్చునని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సౌతాఫ్రికా గడ్డపై మెరుపులు మెరిపించిన టీమ్ఇండియా ఇప్పుడు మొహాలీలో అఫ్గానిస్థాన్ తో తలపడేందుకు సిద్ధమైంది. మూడు టీ20ల సిరిస్లో భాగంగా తొలి టీ20 గురువారం (జనవరి 11న) మొహాలీలో జరగనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు ఏడాదిన్నర తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టి ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ ప్రదర్శనపైనే ఉంది. కానీ, వ్యక్తిగత కారణాలతో తొలి టీ20 విరాట్ ఆడటం లేదు. మరోవైపు టీ20 క్రికెట్లో బలమైన టీమ్ గా ముందుకు సాగుతున్న అఫ్గానిస్థాన్ ఈ సిరీస్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.
IND vs AFG: భారత్-ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20 జరిగేనా..? ఆ విలన్ అడ్డురాకపోతే.. !
మొహాలీ పిచ్ ఎలా ఉంటుంది?
మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో బ్యాట్స్ మెన్ ఆధిపత్యం ఉంటుంది. పిచ్ లో మంచి బౌన్స్ ఉండటం వల్ల బంతి బ్యాట్ పై బాగా వస్తుంది. దీనితో పాటు, ఈ మైదానం అవుట్ ఫీల్డ్ కూడా చాలా వేగంగా ఉండటంతో బౌండరీ లైన్ దాటి బంతిని చేరుకోవడం మరింత సులభం అవుతుంది. అయితే ఈ పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మొదట్లో బ్యాటర్స్ వర్సెస్ బౌలర్స్ మధ్య బిగ్ ఫైట్ చూడవచ్చు.
గత గణాంకాలు ఏం చెబుతున్నాయి?
మొహాలీలోని ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 9 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుదే పైచేయిగా ఉంది. తొలి బ్యాటింగ్ చేసిన జట్టు 5 విజయాలు సాధించింది. రెండో ఇన్నింగ్స్ చేసిన టీమ్ నాలుగు సార్లు ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్ లో సగటు స్కోరు 168 కాగా, రెండో ఇన్నింగ్స్ లో సగటు స్కోరు 152. అయితే, ఇప్పుడు సాయంత్రం మ్యాచ్ కావడంతో.. ఇక్కడి మంచు కారణంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశముంది.
IND V AFG: సెంచరీ కొట్టడం ఖాయం.. సరికొత్త రికార్డు సృష్టించనున్న రోహిత్ శర్మ
యశస్వి జైస్వాల్ లేదా శుభ్మన్ గిల్?
అఫ్గానిస్థాన్ తో జరిగే తొలి టీ20 మ్యాచ్ కు ప్లేయింగ్ ఎలెవన్ ను ఎంపిక చేయడం కెప్టెన్ రోహిత్ శర్మకు అంత సులువు కాదు. మొహాలీలో జరిగే మ్యాచ్ లో శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ మధ్య జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. యశస్వి జైస్వాల్ కు రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, శుభ్ మన్ గిల్ సొంత మైదానం కావడంతో జట్టు మేనేజ్మెంట్ అతనికి ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.
సంజూ శాంసన్ కు చోటు..
భారత్-ఆఫ్ఘన్ తొలి టీ20 మ్యాచ్ లో వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ జట్టులోకి రావడం ఖాయం. అయితే, చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి వస్తున్న సంజూ శాంసన్ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. ఇదే సమయంలో ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకోవడానికి జితేష్ శర్మ నుంచి సంజూకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. జితేష్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో తన మెరుపు బ్యాటింగ్ తో తనదైన ముద్ర వేయడంతో ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కుతుందో లేదో చూడాలి.
IND v AFG: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలిమ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరం.. ఎందుకంటే..?
- 1st T20 Schedule
- Afghanistan Cricket
- BCCI
- Cricket
- Cricket Live
- Cricket Records
- Date
- ICC World Cup
- IND v AFG
- IND v AFG Series
- IND v AFG T20 Series
- IND vs AFG Dream11
- IND vs AFG Pitch Report
- IS Bindra Stadium Pitch
- Ibrahim Zadran
- India
- India Afghanistan Series
- India Afghanistan T20 Series
- India vs Afghanistan
- India vs Afghanistan T20 Series
- India vs Afghanistan playing 11
- India vs Afghanistan series
- Live Score
- Live Streaming
- Mohali Weather
- Pitch Report
- Rohit Sharma
- Rohit Sharma records
- Shubman Gill
- Sports
- T20 Internationals
- T20 World Cup 2024
- Team India squad
- Virat Kohli
- Weather Report
- Yashasvi Jaiswal
- cold fog
- rain