India Afghanistan T20 Series: భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ మ‌ధ్య మొహాలీ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. మంచు వాతావ‌ర‌ణం మ్యాచ్ పై ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంది.  

IND vs AFG 1st T20I: మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే, భార‌త యంగ్స్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ కు తుది జ‌ట్టులో చోటుద‌క్క‌లేదు. జైస్వాల్ టీలో లేక‌పోవ‌డం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. గత 24 గంటల్లో భారత్ తరఫున జైస్వాల్, రోహిత్ ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్లు అని టాక్ వినిపించింది. కానీ జైస్వాల్ ప్ర‌స్తుతం ఆడ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాడ‌నీ, కుడి గజ్జలో నొప్పితో బాధ‌ప‌డుతున్నాడ‌ని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో బీసీసీఐ పేర్కొంది. 

IND VS AFG: మొహాలీలో బ్యాట‌ర్స్ విధ్వంసం సృష్టిస్తారా లేదా బౌలర్లు శాసిస్తారా? పిచ్ రిపోర్ట్..

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్(c), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-జీబ్ ఉర్హక్,

IND vs AFG: భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20 జ‌రిగేనా..? ఆ విల‌న్ అడ్డురాక‌పోతే.. !