IND vs AFG: ఇదేంది గురు ఇలా చేశావ్.. రెండో బాల్ కే రోహిత్ శ‌ర్మ ఇలానా !

India vs  Afghanistan T20 : మొహాలీ వేదిక‌గా భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ మ‌ధ్య  జ‌రుగుతున్న తొలి టీ20 మ్యాచ్ రోహిత్ శ‌ర్మ రెండో బంతిని ఎదుర్కొని ర‌నౌట్ గా వెనుదిరిగాడు. కాల్ ఇవ్వ‌గా ప‌రుగు వ‌చ్చే ద‌గ్గ‌ర శుభ్ మ‌న్ గిల్ క్రీజ్ వ‌దిలి రాక‌పోవ‌డంతో రోహిత్ శ‌ర్మ ర‌నౌట్ గా వెనుదిరిగాడు. 
 

IND vs AFG, 1st T20I LIVE Score: Rohit Sharma was run out facing the second ball, complete misunderstanding  with Shubman Gill RMA

IND vs AFG 1st T20I: భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుని ఆఫ్ఘ‌న్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ 20 ఓవ‌ర్ల‌లో 158/5 (20) ప‌రుగులు చేసింది. భార‌త్ 159 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగ‌గా తొలి ఓవ‌ర్ లోనే షాక్ త‌గిలింది. దాదాపు 14 నెల‌ల త‌ర్వాత టీ20 గేమ్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఖాతా తెర‌వ‌కుండానే ర‌నౌట్ గా వెనుతిరిగాడు. జద్రాన్-గుర్బాజ్ లు రనౌట్ చేశారు.

తొలి ఓవ‌ర్ లో రెండో బాల్ ను ఎదుర్కొన్న రోహిత్ శ‌ర్మ ర‌నౌట్ అయ్యాడు.  ఫజల్ హక్ ఫరూఖీ బౌలింగ్ లో రెండో బాల్ ను ఎద‌ర్కొన్న రోహిత్ శ‌ర్మ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. రోహిత్ శ‌ర్మ ప‌రుగుకు కాల్ ఇచ్చాడు.. అది ఫిల్డ‌ర్ బాల్ ను అడ్డుకోవ‌డంతో.. శుభ్ మ‌న్ గిల్ బాల్ ను చూస్తూ క్రీజ్ నుంచి క‌ద‌ల్లేదు. అయితే, అప్ప‌టికే రోహిత్ శ‌ర్మ ప‌రుగు కోసం రావ‌డంతో.. ఓపెన‌ర్ల గంద‌ర‌గోళం మ‌ధ్య రోహిత్ శ‌ర్మ ర‌నౌట్ గా వెనుదిరిగాడు. ప‌రుగు రావాల్సిన ద‌గ్గ‌ర శుభ్ మ‌న్ గిల్ కాల్ చేసిన క్రీజ్ నుంచి క‌ద‌ల‌క‌పోవ‌డంతో ర‌నౌట్ అయిన రోహిత్ శ‌ర్మ కోపంగా గ్రౌండ్ నుంచి క‌దిలాడు. 

 

 

IND v AFG: సెంచ‌రీ కొట్ట‌డం ఖాయం.. స‌రికొత్త రికార్డు సృష్టించ‌నున్న రోహిత్ శ‌ర్మ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios