IND VS NZ మ్యాచ్ ఫీవర్ మామూలుగా లేదుగా... వాంఖడేలో మెరవనున్న ఫుట్ బాల్ దిగ్గజం

ప్రపంచ కప్ 2023 లో ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వాంఖండే బాటపట్టారు.

ICC World Cup 2023 ... England football player Beckham attends INDIA VS NEW ZEALAND match AKP

ముంబై : నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నారు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 లో ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. అసలు ఓటమన్నదే ఎరగకుండా వరుస విజయాలతో సెమీస్ కు చేరుకుంది భారత్. ఈ క్రమంలో ఇవాళ జరగనున్న సెమీ ఫైనల్లొ న్యూజిలాండ్ పై రోహిత్ సేన ఎలా ఆడతారన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకే అభిమానులు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులే కాదు విదేశీ స్టార్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. 

ఇంగ్లాండ్ కు చెందిన మాజీ ఫుట్ బాల్  ప్లేయర్ డేవిడ్ బెక్ హామ్ ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారట. ఇందుకోసం ఇప్పటికే ముంబైకి చేరుకున్న బెక్ హామ్ మరికొద్దిసేపట్లో వాంఖడేలో ప్రత్యక్ష్యం కానున్నట్లు సమాచారం. దీంతో పుట్ బాల్ ను ఇష్టపడేవారు సైతం ఈ ప్రపంచ కప్ సెమీస్ మ్యాచ్ చూసేందుకు సిద్దమవుతున్నారు. 

ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతున్నది ముంబైలో... కాబట్టి సినీ, వ్యాపార ప్రముఖలు మైదానంలో కనిపించే అవకాశాలున్నాయి.ఇప్పటికే సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ  మ్యాచ్  కోసం ముంబైకి వెళ్లినట్లు సమాచారం. అలాగే తెలుగు హీరో వెంకటేశ్ కూడా ఈ మ్యాచ్ కోసం ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ స్టార్స్ సల్మాన్, అమీర్, రణబీర్ లు.... మరికొందరు హీరోయిన్స్ వాంఖడేలో సందడి చేయనున్నట్లు సమాచారం. 

Read More  IND VS NZ : నేడు కోహ్లీ బ్యాట్ పడితే చాలు... సచిన్, ధోనిల మరో రికార్డ్ బద్దలు

ఇక ప్రముఖ వ్యాపారవేత్త, ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ టీం అధినేత ముఖేష్ అంబానీ కుటుంబసమేతంగా ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ చేసేందుకు  రానున్నట్లు సమాచారం. అలాగే మరికొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ సెమీస్ మ్యాచ్ చూసేందుకు వాంఖడేకు వెళుతున్నట్లు సమాచారం. మాజీ క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడానికి సిద్దమయ్యారు. 

ఇదిలావుంటే ఈ మ్యాచ్ ను మైదానంలో ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కని అభిమానుల కోసం పలు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని పలు పట్టణాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటుచేస్తోంది ఏసిఏ(ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్). విశాఖపట్నంలో అయితే హాయిగా సముద్రపు ఒడ్డున కూర్చుని సమఉజ్జీల మధ్య సమరాన్ని చూసేలా ఏర్పాట్లుచేస్తోంది ఏసిఏ. ఆర్కే బీచ్ లోని కాళీమాత గుడి ఎదురుగా బిగ్ స్క్రీన్ ఏర్పాటుచేసి ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లైవ్ ప్రసారం చేయనున్నారు. అలాగే విజయవాడలో మున్సిపల్ స్టేడియంలో, కడపలో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కోసం బిగ్ స్క్రీన్లను ఏర్పాటుచేసింది ఏసిఏ. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios