ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌తో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాటింగ్ జాబితాలో నలుగురు భారత ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 931 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

928 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్ సందర్భంగా 136 పరుగులు చేయడంతో తన రేటింగ్ పాయింట్లను భారీగా పెంచుకున్నాడు.

Also Read:టాస్ 10 మీటర్ల అవతల పడింది: బౌలింగ్ చేశావా... టాస్ చేశావా అంటూ ట్రోలింగ్

తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన కొత్త కుర్రాడు మయాంక్ అగర్వాల్ ఒక స్థానం ఎగబాకి 700 పాయింట్లతో 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో ఛతేశ్వర్ పుజారా 791, అజింక్య రహానె 759, వరుసగా నాలుగు, ఐదో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తన కెరీర్‌లో తొలిసారిగా టాప్-10లో అడుగుపెట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో అతను 91, 28 పరుగులు చేశాడు. ఇక బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ 26వ స్థానంలో, లిటన్ దాస్ 78వ స్థానంలో నిలచాడు.

Also Read:జోఫ్రా ఆర్చర్ జాతి వివక్ష కామెంట్స్.. కేన్ విలియమ్సన్ క్షమాపణలు

ఇక బౌలర్ల జాబితాలో 716 పాయింట్లతో ఇషాంత్ శర్మ 17వ ర్యాంకులో నిలిచాడు. ఉమేశ్ యాదవ్ 672 పాయింట్లతో 21వ ర్యాంక్‌లో ఉన్నాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 9, బుమ్రా 5వ స్థానంలో నిలిచాడు. ఆల్ ‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 725 పాయింట్లతో ఒక స్థానం మెరుగై రెండో స్థానంలో ఉండగా.. అశ్విన్ ఐదో స్థానంలో ఉన్నాడు.